నాట్కో ఫార్మా లాభం రూ.677 కోట్లు
ABN, Publish Date - Nov 13 , 2024 | 04:09 AM
నాట్కో ఫార్మా.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఆదాయాలు గణనీయంగా పెరగటంతో జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో....
ఒక్కో షేరుకు రూ.1.5 మధ్యంతర డివిడెండ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): నాట్కో ఫార్మా.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఆదాయాలు గణనీయంగా పెరగటంతో జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏకంగా 83 శాతం వృద్ధి చెంది రూ.676.50 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.369 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం రెవెన్యూ కూడా 35.3 శాతం వృద్ధితో రూ.1,060.80 కోట్ల నుంచి రూ.1,434.90 కోట్లకు చేరుకుంది. సెప్టెంబరు త్రైమాసికంలో దేశీయ ఫార్మా వ్యాపారం నిలకడగా ఉండటంతో పాటు ఫార్ములేషన్స్ ఎగుమతులు మెరుగ్గా ఉండటం కలిసివచ్చిందని నాట్కో ఫార్మా పేర్కొంది.
ఫలితాలు ప్రోత్సాహకరగా ఉండటంతో రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.1.50 రెండో మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. డివిడెండ్ చెల్లింపులకు నవంబరు 25ను రికార్డు తేదీగా ఖరారు చేసింది. డిసెంబరు 2 నుంచి ఈ డివిడెండ్ చెల్లింపులు ప్రారంభించనుంది.
Updated Date - Nov 13 , 2024 | 04:09 AM