ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెండేళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధి రేటు

ABN, Publish Date - Nov 30 , 2024 | 05:57 AM

భారత ఆర్థిక ప్రగతి చక్రం వేగం తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి జీడీపీ వృద్ధిరేటు 7 త్రైమాసికాల కనిష్ఠ స్థాయి 5.4 శాతానికి జారుకుంది.

క్యూ2లో 5.4 శాతానికి పరిమితం తయారీ రంగం పేలవ పనితీరు..

వినియోగంలో తగ్గుదలే కారణం

న్యూఢిల్లీ: భారత ఆర్థిక ప్రగతి చక్రం వేగం తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి జీడీపీ వృద్ధిరేటు 7 త్రైమాసికాల కనిష్ఠ స్థాయి 5.4 శాతానికి జారుకుంది. తయారీ, మైనింగ్‌ రంగాల పేలవ పనితీరుతోపాటు దేశంలో వస్తు వినియోగం తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో జీడీపీ వృద్ధి రేటు 8.1 శాతంగా నమోదు కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో 6.7 శాతంగా ఉంది.

మరిన్ని ముఖ్యాంశాలు..

2022-23 ఆర్థిక సంవత్సరం క్యూ3 (అక్టోబరు-డిసెంబరు) వృద్ధిరేటు 4.3 శాతానికి పడిపోగా.. ఆ తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి ఇదే.

వినియోగదారుల వ్యయానికి సంకేతమైన ప్రైవేట్‌ తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ) క్యూ1లో 7.4 శాతం కాగా.. క్యూ2లో 6 శాతానికి తగ్గింది.

రెండేళ్ల స్థాయికి జారినప్పటికీ, శరవేగంగా వృద్ధి చెందుతున్న బడా ఆర్థిక వ్యవస్థగా భారత్‌ తన హోదాను నిలబెట్టుకోగలిగింది. సెప్టెంబరు త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు 4.6 శాతానికి పరిమితమైంది.

జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) డేటా ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం క్యూ2లో వాస్తవిక జీడీపీ లేదా స్థిర ధరల ఆధారిత జీడీపీ అంచనా రూ.44.10 లక్షల కోట్లుగా ఉంది. 2023-24లో ఇదే కాలానికి రూ.41.86 లక్షల కోట్ల జీడీపీతో పోలిస్తే 5.4 శాతం వృద్ధి నమోదైంది. కాగా, ఈ క్యూ2లో నామినల్‌ జీడీపీ లేదా ప్రస్తుత ధరల ఆధారిత జీడీపీ అంచనా రూ.76.60 లక్షల కోట్లుగా ఉంది. గత క్యూ2లో రూ.70.90 లక్షల కోట్ల జీడీపీతో పోలిస్తే 8 శాతం వృద్ధి నమోదైంది.

2024-25 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి వాస్తవిక జీడీపీ అంచనా రూ.87.74 లక్షల కోట్లుగా ఉంది. 2023-24లో ఇదే కాలానికి రూ.82.77 లక్షల కోట్ల జీడీపీతో పోలిస్తే 6 శాతం వృద్ధి కనబరిచింది. కాగా, ఈ ప్రథమార్ధంలో నామినల్‌ జీడీపీ అంచనా రూ.153.91 లక్షల కోట్లుగా ఉంది. 2023-204 ప్రథమార్ధంలో రూ.141.40 కోట్ల నామినల్‌ జీడీపీతో పోలిస్తే 8.9 శాతం వృద్ధి నమోదైంది.

రెండో త్రైమాసిక జీడీపీ నిరాశపరి చినప్పటికీ, పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలకు అనుగుణంగా 6.5 శాతానికి చేరుకోగలదన్న నమ్మకం ఉందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు వీ అనంత నాగేశ్వరన్‌ అన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 05:57 AM