నయా ఫండ్స్..
ABN, Publish Date - Nov 11 , 2024 | 02:40 AM
బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ.. కన్జంప్షన్ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది కన్జంప్షన్ థీమ్‌తో రూపొందించిన ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. వినియోగదారుల ప్రవర్తన, ఖర్చుల ఆధారంగా ఈ ఫండ్‌ను....
బజాజ్ ఫిన్‌సర్వ్ కన్జంప్షన్ ఫండ్
బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ.. కన్జంప్షన్ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది కన్జంప్షన్ థీమ్‌తో రూపొందించిన ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. వినియోగదారుల ప్రవర్తన, ఖర్చుల ఆధారంగా ఈ ఫండ్‌ను రూపొందించింది. ఈ ఫండ్‌కు నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ (టీఆర్‌ఐ) బెంచ్‌మార్క్‌గా ఉంటుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.500. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 22.
టాటా ఇండియా ఇన్నోవేషన్ ఫండ్
టాటా అసెట్ మేనేజ్‌మెంట్.. టాటా ఇండియా ఇన్నోవేషన్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఇన్నోవేటివ్ వ్యూహాలు, సరికొత్త థీమ్స్ ను ఉపయోగిస్తూ ముందుకు సాగుతున్న అన్ని రంగాల్లోని కంపెనీల్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెట్టనుంది. మదుపరులకు దీర్ఘకాలంలో మెరుగైన రిటర్నులు అందించే విధంగా ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత విభాగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.5,000. ఈ నెల 11న ప్రారంభమయ్యే ఈ ఫండ్ 25న ముగియనుంది.
యాక్సిస్ సెప్టెంబరు 2027 ఇండెక్స్ ఫండ్
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. యాక్సిస్ క్రిసిల్-ఐబీఎక్స్ ఏఏఏ ఫైనాన్షియల్ సర్వీసెస్- సెప్టెంబరు 2027 ఇండెక్స్ ఫండ్ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. వడ్డీ రేటు రిస్క్ తక్కువ ఉన్న, క్రెడిట్ రిస్క్ తక్కువగా ఉన్న వాటిల్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెట్టనుంది. ఈ పథకం మెచ్యూరిటీ తేదీ 2027 సెప్టెంబరు 30. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకం ముగింపు తేదీ ఈ నెల 21.
Updated Date - Nov 11 , 2024 | 02:40 AM