ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Whatsup: మహిళలు ఇక మీ డీపీ భద్రమే.. వాట్సప్ కొత్త ఫీచర్ తెలుసా

ABN, Publish Date - Feb 23 , 2024 | 02:49 PM

వాట్సప్(Whatsup) వినియోగదారుల భద్రత విషయంలో మెటా(Meta) మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వినియోగదారుల భద్రత కోసం ఇప్పటికే ఎన్నో అప్‌డేట్స్ ప్రకటించిన వాట్సప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ వాట్సప్ బీటా వర్షన్ యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది.

ఢిల్లీ: వాట్సప్(Whatsup) వినియోగదారుల భద్రత విషయంలో మెటా(Meta) మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వినియోగదారుల భద్రత కోసం ఇప్పటికే ఎన్నో అప్‌డేట్స్ ప్రకటించిన వాట్సప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ వాట్సప్ బీటా వర్షన్ యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది. తాజా ఫీచర్‌ ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి నంబర్ తీసుకుని డీపీ చూడటానికి ప్రయత్నిస్తే.. ఇకపై డీపీ(DP) కనిపించదు. వినియోగదారుల భద్రతలో, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఈ ఫీచర్ కీలకంగా వ్యవహరిస్తుంది.

అపరిచిత వ్యక్తుల నుంచి వ్యక్తిగత భద్రత కోసం ఇది ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఇతర వినియోగదారులు ప్రొఫైల్ ఫొటోల స్క్రీన్‌షాట్‌లను తీసుకోకుండా నిరోధించే ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం WhatsApp బీటా యాప్‌లో ఇది అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్ ప్రొఫైల్ పిక్చర్ స్క్రీన్‌షాట్‌ను క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు యాప్ పరిమితుల కారణంగా స్క్రీన్‌షాట్ తీయడం సాధ్యం కాదనే సందేశాన్నిస్తూ స్క్రీన్‌పై హెచ్చరిక చూపిస్తుంది.


అంటే ఓ వ్యక్తి అనుమతి లేకుండా వారి డీపీని క్యాప్చర్ చేయలేమన్నమాట.తద్వారా మహిళలపై వేధింపులు తగ్గుతాయని మెటా భావిస్తోంది. ప్రస్తుతం ఎంచుకున్న బీటా టెస్టర్‌ల గ్రూపుకు మాత్రమే ఈ ప్రైవసీ ఫీచర్ అందుబాటులో ఉన్నప్పటికీ, రాబోయే వారాల్లో ఈ ఫీచర్ వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Snapchat, Paytm, Google Pay వంటి యాప్‌లు ఇప్పటికే ఇలాంటి ఫీచర్‌ని కలిగి ఉన్నాయి. అయితే అదే ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకోవడం రాకపోయినప్పటికీ.. ఇతర ఫోన్లను ఉపయోగించి సదరు డీపీని ఫొటో తీసుకోవడాన్ని తాజా ఫీచర్ ఆపలేదు. డీప్‌ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వంటి అడ్వాన్స్ టెక్నాలజీల బారి నుంచి వ్యక్తిగత గోప్యతను రక్షించడానికి మెటా యాజమాన్యం చాట్ బాట్‌పై కూడా పని చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 23 , 2024 | 04:09 PM

Advertising
Advertising