No holiday: మే 1న కూడా ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు నో హాలిడే
ABN, Publish Date - May 01 , 2024 | 08:25 AM
నేడు (మే 1న) అంతర్జాతీయ కార్మిక దినోత్సవం(International Workers Day). ఈ సందర్భంగా ఇండియాతోపాటు అనేక దేశాల్లో కార్మిక దినోత్సవం రోజున సెలవు ఉంటుంది. దీనిని సాధారణంగా మే డే(may day) అని పిలుస్తారు. అయితే ఈరోజున దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు సెలవు(Bank Holiday) ఉంటుందా లేదా అనే ప్రశ్న అనేక మందిలో మొదలైంది.
నేడు (మే 1న) అంతర్జాతీయ కార్మిక దినోత్సవం(International Workers Day). ఈ సందర్భంగా ఇండియాతోపాటు అనేక దేశాల్లో కార్మిక దినోత్సవం రోజున సెలవు ఉంటుంది. దీనిని సాధారణంగా మే డే(may day) అని పిలుస్తారు. అయితే ఈరోజున దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు సెలవు(Bank Holiday) ఉంటుందా లేదా అనే ప్రశ్న అనేక మందిలో మొదలైంది. ఈ క్రమంలో కార్మిక దినోత్సవం మే 1, 2024న హాలిడే ఉండే రాష్ట్రాల జాబితాను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించింది. వాటిలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు మూసివేయబడతాయని తెలిపింది.
వాటిలో మే 1న సెలవు ఉండే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అసోం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ(telangana), మణిపూర్, కేరళ, బెంగాల్, గోవా, బీహార్ మాత్రమే ఉన్నాయి. ఇక పంజాబ్(punjab), చత్తీస్‌గఢ్(Chhattisgarh) వంటి మిగతా రాష్ట్రాల్లో మే డే రోజున కూడా బ్యాంకులు పనిచేయనున్నాయి. మరోవైపు మహారాష్ట్ర దినోత్సవం, మే డే సందర్భంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం మూసివేయబడతాయి.
అయితే కార్మిక దినోత్సవం(International Workers Day) సందర్భంగా సెలవు ఉన్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కొన్ని సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. వాటిలో ఆసుపత్రుల్లో వైద్యం, అత్యవసర సేవలు, ప్రజా రవాణా, పోలీస్, మీడియా వంటి పలు సేవలు యథావిధిగా కొనసాగుతాయి.
భారతదేశం కాకుండా, ఆస్ట్రేలియా, కెనడా, చైనా(china), తైవాన్, యునైటెడ్ స్టేట్స్, టర్కీ, ట్రినిడాడ్ టొబాగో, పోలాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, మకావు, జపాన్, జమైకా, S.A.R, సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాఖ్య సెలవుదినంగా పాటిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
LPG Gas: గుడ్ న్యూస్.. తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర
Abhibus : ఓటర్ల కోసం అభిబస్ ప్రత్యేక ఆఫర్
Read Latest Business News and Telugu News
Updated Date - May 01 , 2024 | 08:28 AM