ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గాయత్రీ ప్రాజెక్ట్స్‌పై లిక్విడేషన్‌ వద్దు

ABN, Publish Date - May 14 , 2024 | 05:47 AM

గాయత్రీ ప్రాజెక్ట్స్‌ దివాలా ప్రక్రియ (లిక్విడేషన్‌) కొత్త మలుపు తిరిగింది. లిక్విడేషన్‌కు వ్యతిరేకంగా కంపెనీ ప్రమోటర్లయిన టీ సుబ్బరామి రెడ్డి కుటుంబం.. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), హైదరాబాద్‌ బెంచ్‌ని...

ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన ప్రమోటర్లు జూ రూ.750 కోట్లతో సెటిల్‌మెంట్‌ ఆఫర్‌

హైదరాబాద్‌: గాయత్రీ ప్రాజెక్ట్స్‌ దివాలా ప్రక్రియ (లిక్విడేషన్‌) కొత్త మలుపు తిరిగింది. లిక్విడేషన్‌కు వ్యతిరేకంగా కంపెనీ ప్రమోటర్లయిన టీ సుబ్బరామి రెడ్డి కుటుంబం.. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), హైదరాబాద్‌ బెంచ్‌ని ఆశ్రయించింది. రుణదాతలకు చెల్లించాల్సిన రూ.9,115 కోట్లలో రూ.750 కోట్లు చెల్లించి వివాదాన్ని సెటిల్‌ చేసుకునేందుకు ముందుకొచ్చింది. దివాలా చట్టం నిబంధనల ప్రకారం ఈ ప్రతిపాదనకు కంపెనీకి రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో 90 శాతం మంది ఒప్పుకోవాల్సి ఉంటుంది.


ఒప్పుకోక తప్పదు: దివాలా ప్రక్రియలో ఉన్న గాయత్రీ ప్రాజెక్ట్‌ను కొనుగోలు చేసేందుకు మార్క్‌ ఏబీ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అనే ఒకే ఒక సంస్థ ముందుకొచ్చింది. అయితే ఇందుకోసం ఈ కంపెనీ రూ.650 కోట్లు మాత్రమే ఆఫర్‌ చేసింది. మళ్లీ ఇందులో రూ.50 కోట్లు నగదు రూపంలో, మిగతా మొత్తం గ్యారెంటీల రూపంలో చెల్లిస్తానని తెలిపింది. ఈ ఆఫర్‌తో పోలిస్తే కంపెనీ ప్రమోటర్లు ఆఫర్‌ చేసిన రూ.750 కోట్ల ఆఫర్‌ ఆకర్షణీయంగా ఉంది. దీంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ ఆఫర్‌కే మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Updated Date - May 14 , 2024 | 05:47 AM

Advertising
Advertising