హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ అదుర్స్
ABN, Publish Date - Sep 18 , 2024 | 01:21 AM
హైదరాబాద్‌లో కార్యాలయాల భవనాల (ఆఫీస్ స్పేస్)కు డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో నగరంలో 50 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీస్ స్పేస్...
తొలి ఆరు నెలల్లో 71ు అప్: నైట్ ఫ్రాంక్ ఇండియా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌లో కార్యాలయాల భవనాల (ఆఫీస్ స్పేస్)కు డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో నగరంలో 50 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీస్ స్పేస్ లీజు ఒప్పందాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 71 శాతం ఎక్కువని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. హైదరాబాద్‌లో పెరుగుతున్న జీసీసీ కేంద్రాలు, ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌కు పెరుగుతున్న గిరాకీ ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది.
పెద్ద కార్యాలయాలకే అధిక డిమాండ్: కాగా హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకునే కంపెనీల్లో ఎక్కువ కంపెనీలు లక్ష ఎస్‌ఎ్‌ఫటీ లేదా అంతకు మించిన పెద్ద భవనాలపైనే ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో నమోదైన ఆఫీస్ స్పేస్ లీజు ఒప్పందాల్లో 61 శాతం ఈ తరహా ఒప్పందాలని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గత ఏడాది తొలి ఆరు నెలల్లో 14.7 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీస్ స్పేస్ కోసం ఈ తరహా లీజు ఒప్పందాలు జరిగాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఇది 30.08 లక్షల ఎస్‌ఎ్‌ఫటీకి చేరింది. మరో 26 శాతం లీజు ఒప్పందాలు 50,000-1,00,000 ఎస్‌ఎ్‌ఫటీకి, 13 శాతం లీజు ఒప్పందాలు 50,000 ఎస్‌ఎ్‌ఫటీ కంటే తక్కువ ఆఫీస్ స్పేస్ లీజు ఒప్పందాలని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది.
Updated Date - Sep 18 , 2024 | 01:21 AM