స్వల్ప నష్టాలతో సరి
ABN, Publish Date - Apr 04 , 2024 | 02:19 AM
లాభాల స్వీకారంతో దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 27.09 పాయింట్ల నష్టంతో 73,876.82 వద్ద ముగియగా, నిఫ్టీ 18.65 పాయింట్ల నష్టంతో 22,434.65 వద్ద ముగిసింది..
ముంబై: లాభాల స్వీకారంతో దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 27.09 పాయింట్ల నష్టంతో 73,876.82 వద్ద ముగియగా, నిఫ్టీ 18.65 పాయింట్ల నష్టంతో 22,434.65 వద్ద ముగిసిం ది. వడ్డీరేట్ల భవిష్యత్‌పై అమెరికా కేంద్ర బ్యాంకు చైర్మన్ జెరోం పోవెల్ ఈ రాత్రికి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని మార్కెట్ ఆతృతగా ఎదురు చూస్తోంది. అమ్మకాల ఒత్తిడి కొనసాగినా నిఫ్టీకి 22,350 వద్ద కీలక మద్దతు లభిస్తుందని టెక్నికల్ అనలిస్టుల అంచనా.
వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణ: వొడాఫోన్ ఐడియా రూ.20,000 కోట్లు సమీకరించనుంది. మంగళవారం జరిగిన వాటాదారుల అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని వాటాదారుల్లో 99.01 శాతం మంది ఆమోదించినట్టు కంపెనీ బీఎ్‌సఈకి తెలిపింది.
Updated Date - Apr 04 , 2024 | 02:19 AM