ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓలా ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌

ABN, Publish Date - Aug 16 , 2024 | 01:42 AM

ఓలా ఎలక్ట్రిక్‌ తాజాగా విద్యుత్‌ మోటార్‌ సైకిళ్ల విభాగంలోకి ప్రవేశించింది. రోడ్‌స్టర్‌ సిరీ్‌సలో మూడు ఈ-బైక్‌లను గురువారం విడుదల చేసింది. అందులో రోడ్‌స్టర్‌ ఎక్స్‌ ప్రారంభ ధర రూ.74,999 కాగా...

3 వేరియంట్లు విడుదల చేసిన సంస్థ.. ప్రారంభ ధర రూ.74,999

కృష్ణగిరి (తమిళనాడు): ఓలా ఎలక్ట్రిక్‌ తాజాగా విద్యుత్‌ మోటార్‌ సైకిళ్ల విభాగంలోకి ప్రవేశించింది. రోడ్‌స్టర్‌ సిరీ్‌సలో మూడు ఈ-బైక్‌లను గురువారం విడుదల చేసింది. అందులో రోడ్‌స్టర్‌ ఎక్స్‌ ప్రారంభ ధర రూ.74,999 కాగా, రోడ్‌స్టర్‌ ధర రూ.1,04,999గా ఉంది. రోడ్‌స్టర్‌ ప్రో మోడల్‌ ప్రారంభ ధరను రూ.1,99,999గా నిర్ణయించింది. రోడ్‌స్టర్‌, రోడ్‌స్టర్‌ ఎక్స్‌ బైక్‌ల డెలివరీ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానున్నాయని, రోడ్‌స్టర్‌ ప్రో మాత్రం వచ్చే ఏడాది దీపావళి నాటికి అందుబాటులోకి రానుందని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాదు, ఓలా ఎలక్ట్రిక్‌ మరో రెండు కొత్త మోటార్‌ సైకిళ్లను సైతం మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సంకేతాలిచ్చింది. ఓలా వార్షిక సదస్సు ‘సంకల్ప్‌ 2024’లో సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ భవిశ్‌ అగర్వాల్‌ ఈ-బైక్‌లను ఆవిష్కరించడంతోపాటు మరిన్ని కీలక ప్రకటనలను చేశారు.


ఓలా క్యాబ్‌ ఇక ఓలా కన్స్యూమర్‌: ఓలా తన ఆన్‌లైన్‌ క్యాబ్‌ బుకింగ్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ ఓలా క్యాబ్స్‌ పేరును ఓలా కన్స్యూమర్‌గా మార్చింది. కంపెనీ ఇకపై ఆఫర్‌ చేయబోయే సేవల్లో క్యాబ్‌ బుకింగ్‌ ఒకటిగా ఉండనుంది. ఈ విభాగం ద్వారా పలు సేవలందించబోతున్నట్లు భవిశ్‌ తెలిపారు.

క్విక్‌ కామర్స్‌ కోసం పోర్టబుల్‌ డార్క్‌ వేర్‌హౌ్‌సలు: ఓలా క్విక్‌ కామర్స్‌ సేవల్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపింది. ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) ద్వారా బుకింగ్‌పై త్వరితగతిన డెలివరీ అందించేందుకు వీలుగా పోర్టబుల్‌ డార్క్‌ వేర్‌హౌ్‌సలను నిర్మించనున్నట్లు, ఈ ఏడాది చివరినాటికివి అందుబాటులోకి రానున్నాయని భవిశ్‌ వెల్లడించారు. అయితే, నేరుగా తాము ఉత్పత్తులను విక్రయించే ఉద్దేశం లేదని.. డైరెక్ట్‌ టు కన్స్యూ మర్‌ బ్రాండ్లు, ఇతర విక్రేతలు తాము విక్రయించే ఉత్పత్తులను స్టోర్‌ చేసుకునేందుకు ఈ డార్క్‌ స్టోర్లను నిర్మిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కంపెనీ ఈ-స్కూటర్లలో కృత్రిమ్‌ ఏఐ: ఓలా గ్రూప్‌నకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్‌ కృత్రిమ్‌ సేవలను సంస్థ ఎలక్ట్రిక్‌ స్కూటర్లలోనూ అందుబాటులోకి తేబోతున్నట్లు, ఈ దీపావళినాటికి బీటా వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు భవిశ్‌ తెలిపారు. అలాగే, కృత్రిమ్‌ ఏఐ కస్టమర్‌ కేర్‌ యాప్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 22 భాషల్లో అందుబాటులో ఉండే ఈ యాప్‌ ద్వారా డెవలపర్లు తమ కస్టమర్‌ కేర్‌ సేవలను యాంత్రీకరించుకోవచ్చన్నారు.ఓలా ఎలక్ట్రిక్‌, ఓలా క్యాబ్‌ ఇప్పటికే ఈ యాప్‌ సేవలను వినియోగించుకుంటున్నాయన్నారు.


ఏఐ చిప్‌ల తయారీలోకి కృత్రిమ్‌: కృత్రిమ్‌ ఏఐ చిప్‌ల తయారీలోకి ప్రవేశించబోతోంది. బోధి 1 పేరుతో ఏఐ చిప్‌లను తయారు చేస్తున్నట్లు, 2026 నాటికి తొలి చిప్‌ అందుబాటులోకి రానుందని భవిశ్‌ చెప్పారు.

ఓలా పే

ఓలా యాప్‌ ద్వారా క్యాబ్‌ రైడ్‌ లేదా ఫుడ్‌, కిరాణా సరుకుల ఆర్డర్ల కోసం యూపీఐ చెల్లింపులు జరిపేందుకు వీలుగా కంపెనీ ఓలా పే సేవలను సైతం ప్రారంభించింది.

Updated Date - Aug 16 , 2024 | 01:42 AM

Advertising
Advertising
<