హైదరాబాద్‌లో ఒలింపస్ ఓడీసీ కేంద్రం
ABN, Publish Date - Jun 13 , 2024 | 04:33 AM
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ కొలువు తీరనుంది. మెడికల్ టెక్నాలజీలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా పేరొందిన ఒలింపస్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో తన ఆర్ అండ్ డీ ఆఫ్‌షోర్...
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ కొలువు తీరనుంది. మెడికల్ టెక్నాలజీలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా పేరొందిన ఒలింపస్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో తన ఆర్ అండ్ డీ ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఓడీసీ) ఏర్పాటు చేయనుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థతో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఒలింపస్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రులు డీ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి సమక్షంలో ఒలింపస్ కార్పొరేషన్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఆర్ అండ్ డీ) సయ్యద్ నవీద్ ఈ విషయం ప్రకటించారు. మరోవైపు ఈ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లో ఒలింపస్ కస్టమర్ల కోసం డెడికేటెడ్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం వచ్చే నెలాఖరుకల్లా కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. ఈ కేంద్రం ద్వారా అమెరికా, యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లోని ఒలింపస్ కస్టమర్లకు అధునాతన వైద్య సేవలు అందిస్తారు.
Updated Date - Jun 13 , 2024 | 04:33 AM