అజర్‌బైజాన్‌ చమురు క్షేత్రంలో ఓఎన్‌జీసీ విదేశ్‌ చేతికి ఈక్వియర్‌ వాటా

ABN, Publish Date - Jul 21 , 2024 | 01:55 AM

అజర్‌బైజాన్‌ చమురు క్షేత్రంలో నార్వే సంస్థ ఈక్వియర్‌ వాటాను కొనుగోలు చేసినట్లు ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌ (ఓవీఎల్‌) వెల్లడించింది. 6 కోట్ల డాలర్ల (దాదాపు రూ.500 కోట్లు)కు ఈ వాటాను...

అజర్‌బైజాన్‌ చమురు క్షేత్రంలో ఓఎన్‌జీసీ విదేశ్‌ చేతికి ఈక్వియర్‌ వాటా

న్యూఢిల్లీ: అజర్‌బైజాన్‌ చమురు క్షేత్రంలో నార్వే సంస్థ ఈక్వియర్‌ వాటాను కొనుగోలు చేసినట్లు ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌ (ఓవీఎల్‌) వెల్లడించింది. 6 కోట్ల డాలర్ల (దాదాపు రూ.500 కోట్లు)కు ఈ వాటాను కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఈక్వినార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఒప్పందంలో భాగంగా అజర్‌బైజాన్‌లోని అజేరీ చిరాగ్‌ గునాషి (ఏసీజీ) చమురు క్షేత్రంలో 0.615 శాతం వాటాతో పాటు బాకు తబిలిసీ సేహాన్‌ (బీటీసీ) పైప్‌లైన్‌ కంపెనీలో 0.737 శాతం వాటాకు సమానమైన షేర్లను మరో అనుబంధ సంస్థ ఓఎన్‌జీసీ బీటీసీ ద్వారా కొనుగోలు చేసినట్లు ఓవీఎల్‌ తెలిపింది. రానున్న కొద్ది నెలల్లో ఈ డీల్‌ పూర్తవుతుందని పేర్కొంది.

Updated Date - Jul 21 , 2024 | 01:55 AM

Advertising
Advertising
<