ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓఎన్‌జీసీ లాభం 19 రెట్లు

ABN, Publish Date - May 22 , 2024 | 05:30 AM

ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో నికర లాభంలో 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022-23 సంవత్సరంతో పోల్చితే కంపెనీ స్టాండ్‌ఎలోన్‌ నికర లాభం రూ.528 కోట్ల నుంచి రూ.9,869 కోట్లకు...

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో నికర లాభంలో 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022-23 సంవత్సరంతో పోల్చితే కంపెనీ స్టాండ్‌ఎలోన్‌ నికర లాభం రూ.528 కోట్ల నుంచి రూ.9,869 కోట్లకు పెరిగింది. 2016 ఏప్రిల్‌ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య కాలానికి వివాదాస్పద పన్నుల డిమాండు కోసం గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.9,235 కోట్లు కేటాయించినట్టు కంపెనీ వెల్లడించింది. అయితే కంపెనీ క్యూ4 ఆదాయం 4.6 శాతం తగ్గి రూ.34,637 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ రూ.1.38 లక్షల కోట్ల ఆదాయం పై రూ.40,526 కోట్ల చారిత్రక గరిష్ఠ నికర లాభం ఆర్జించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2023-24 సంవత్సరానికి 50 శాతం (రూ.5 ముఖవిలువ గల ఒక్కో షేరుపై రూ.2.50) తుది డివిడెండుకు సిఫారసు చేసింది.

Updated Date - May 22 , 2024 | 05:30 AM

Advertising
Advertising