భారత్ బయోటెక్ నుంచి ఓరల్ పోలియో వ్యాక్సిన్
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:10 AM
హైదరాబాద్ కేంద్రంగా పని చేసే భారత్ బయోటెక్ మరో వినూత్న వ్యాక్సిన్ ఉత్పత్తికి సిద్ధమవుతోంది. నోటి ద్వారా తీసుకునే పోలియో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది...

హైదరాబాద్ కేంద్రంగా పని చేసే భారత్ బయోటెక్ మరో వినూత్న వ్యాక్సిన్ ఉత్పత్తికి సిద్ధమవుతోంది. నోటి ద్వారా తీసుకునే పోలియో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇందుకోసం నెదర్లాండ్ కేంద్రంగా పని చేసే బిల్తోవెన్ బయోలాజికల్స్ బీ.వీ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ఇందు కు అవసరమైన అనుమతుల కోసం రెండు కంపెనీలు సంయుక్తంగా దరఖాస్తు చేస్తాయి. భారత్ బయోటెక్ ఉత్పత్తిచేసే ఓరల్ పోలియో వ్యాక్సిన్లను భారత్‌తో పా టు ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తారు. బిల్తోవెన్ బ యోలాజికల్స్.. సీరమ్ ఇనిస్టిట్యూట్ అనుబంధ సంస్థ.