పరమేశు బయోటక్ రూ.600 కోట్ల ఐపీఓ
ABN, Publish Date - Nov 10 , 2024 | 01:46 AM
ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి కేంద్రంగా పనిచేసే పరమేశు బయోటెక్ రూ.600 కోట్ల నిధుల సమీకరణ కోసం త్వరలో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి కేంద్రంగా పనిచేసే పరమేశు బయోటెక్ రూ.600 కోట్ల నిధుల సమీకరణ కోసం త్వరలో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా రూ.520 కోట్ల మొత్తానికి కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ చేయనుండగా మిగతా రూ.80 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) ద్వారా సమీకరించనుంది. ఐపీఓ ద్వారా సమీకరించే నిధులతో మధ్యప్రదేశ్‌లో రూ.330 కోట్లతో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే మరో రూ.85 కోట్లను రుణాల చెల్లింపు సహా సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనుంది.
Updated Date - Nov 10 , 2024 | 01:46 AM