పెన్నా, సంఘీ.. అంబుజాలో విలీనం
ABN, Publish Date - Dec 18 , 2024 | 01:34 AM
పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో పాటు సంఘీ ఇండస్ట్రీ్‌సను తనలో విలీనం చేసుకోబోతున్నట్లు అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్ మంగళవారం వెల్లడించింది. ఇందుకోసం విడివిడిగా విలీన పథకాలను...
న్యూఢిల్లీ: పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో పాటు సంఘీ ఇండస్ట్రీ్‌సను తనలో విలీనం చేసుకోబోతున్నట్లు అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్ మంగళవారం వెల్లడించింది. ఇందుకోసం విడివిడిగా విలీన పథకాలను ప్రకటించింది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు అంబుజాకు అనుబంధ విభాగాలుగా ఉన్నాయి. సంస్థ నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడంతో పాటు మెరుగైన పాలనకు ఇది తోడ్పడనుందని అంబుజా సిమెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) సహా ఇతర నియంత్రణ మండళ్ల అనుమతులకు లోబడి విలీన ప్రక్రియ పూర్తికి 9-12 నెలల సమయం పట్టవచ్చని అంచనా వేసింది. అంబుజా సిమెంట్ 2023 డిసెంబరులో సంఘీ ఇండస్ట్రీ్‌సను, 2024 ఆగస్టులో పెన్నా సిమెంట్‌ను కొనుగోలు చేసింది.
కాగా, విలీన పథకంలో భాగంగా సంఘీ ఇండస్ట్రీస్ వాటాదారులకు తాము కలిగిన ప్రతి 100 షేర్లకు గాను అంబుజా సిమెంట్స్‌కు చెందిన 12 షేర్లు దక్కనున్నాయి. పెన్నా సిమెంట్ విషయానికొస్తే, రికార్డు తేదీ నాటికి కంపెనీ షేర్లు కలిగిన వారికి ఒక్కో షేరుకు రూ.321.50 లభించనుంది.
Updated Date - Dec 18 , 2024 | 02:45 AM