పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ రూ.440 కోట్ల పెట్టుబడులు
ABN, Publish Date - Nov 13 , 2024 | 04:10 AM
పోకర్ణ లిమిటెడ్ అనుబంధ సంస్థ పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ (పీఈఎ్‌సఎల్)..రూ.440 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణలోని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పోకర్ణ లిమిటెడ్ అనుబంధ సంస్థ పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ (పీఈఎ్‌సఎల్)..రూ.440 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణలోని మేకగూడలోని క్వార్ట్జ్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ మొత్తాలను వినియోగించనున్నట్లు తెలిపింది. విస్తరణలో భాగంగా మూడో బ్రెటోన్‌స్టోన్ ఉత్పత్తి లైన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. 2026 మార్చి నాటికల్లా ఈ కొత్త లైన్ వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందని తెలిపింది. అంతర్జాతీయంగా ప్రీమియం క్వార్ట్జ్ సర్ఫే్‌సకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు ఈ విస్తరణ దోహదపడుతుందని పీఈఎ్‌సఎల్ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ తెలిపారు. కాగా ఈ మొత్తాలను పూర్తిగా అంతర్గత వనరులు, రుణాల రూపంలో సమీకరించనున్నట్లు పోకర్ణ వెల్లడించింది.
క్యూ2 లాభం రూ.45 కోట్లు:సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో పోకర్ణ లిమిటెడ్ రూ.253.46 కోట్ల కన్సాలిడేటెడ్ రెవెన్యూపై రూ.44.95 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.33.04 కోట్లుగా ఉండగా రెవెన్యూ రూ.203.86 కోట్లుగా ఉంది.
Updated Date - Nov 13 , 2024 | 04:10 AM