వాతావరణ మార్పులతో ధరలు మళ్లీ పైకి..!
ABN, Publish Date - Apr 24 , 2024 | 06:14 AM
వాతావరణంలో తీవ్ర మార్పులతో పాటు దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో ద్రవ్యోల్బణానికి ముప్పు పొంచి ఉన్నప్పటికీ, జీడీపీ వృద్ధి పథంలో మరింత ఎగబాకేందుకు...
హెచ్చరించిన ఆర్‌బీఐ బులెటిన్
ముంబై: వాతావరణంలో తీవ్ర మార్పులతో పాటు దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో ద్రవ్యోల్బణానికి ముప్పు పొంచి ఉన్నప్పటికీ, జీడీపీ వృద్ధి పథంలో మరింత ఎగబాకేందుకు అవసరమైన పరిస్థితులు రూపొందుతున్నాయని మంగళవారం విడుదల చేసిన ఏప్రిల్ బులెటిన్‌లో ఆర్‌బీఐ పేర్కొంది. ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ (రెపో) రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు కీలకమైన రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో 4.9 శాతానికి తగ్గింది. అంతక్రితం వరుసగా రెండు నెలలు సూచీ 5.1 శాతంగా నమోదైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం..ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా నమోదుకానున్న వర్షాలు ఆహార ధరలు తగ్గుముఖం పట్టేందుకు దోహదపడనున్నప్పటికీ ఈ వేసవిలో వాటి రేట్లు ఎగబాకే అవకాశాలున్నందున పరిస్థితులను జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.
Updated Date - Apr 24 , 2024 | 06:14 AM