ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

LPG Prices: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు

ABN, Publish Date - Sep 01 , 2024 | 08:35 AM

గ్యాస్ (LPG Cylinder Prices) వినియోగదారులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. ప్రతినెలలాగే సెప్టెంబర్ 1న సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి..

హైదరాబాద్: గ్యాస్ (LPG Cylinder Prices) వినియోగదారులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. ప్రతినెలలాగే సెప్టెంబర్ 1న సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి. దీంతో వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.39 పెంచడంతో వాణిజ్య వినియోగదారులకు షాక్ తగిలింది. పెంచిన ధరలు ఆదివారం తెల్లవారుజాము నుంచే అమలులోకి వచ్చాయి. కేంద్రం అధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు 1,691.50 రూపాయలకు పెరిగింది. చెన్నై- 1,855, కోల్‌కతా - రూ.1,802.50, ముంబయి- రూ.1,644 పలుకుతోంది. హైదరాబాద్‌లోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి.


రెండోసారి..

కాగా ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కేవలం నెల రోజుల వ్యవధిలో వాణిజ్య సిలిండర్‌ ధర పెంచడం రెండోసారి. ఆగస్టులో కూడా ఒక్కో సిలిండర్ రూ.8.50 మేర పెరిగింది. తాజాగా మరో రూ.39 పెరగడం వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. మే, జూన్, జులై నెలల్లో కాస్త తగ్గించి ఊరటనిచ్చిన చమురు కంపెనీలు ఆ తరువాత పెంచుతూ వచ్చాయి.

గృహావసరాల కోసం..

అయితే గృహ వినియోగదారులకు చమురు కంపెనీలు ఊరటనిచ్చాయి. సెప్టెంబర్‌లో గృహావసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర ప్రస్తుతం రూ.803 పలుకుతోంది. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సిలిండర్‌పై సబ్సిడీ ఇస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ చమురు ధరలు, పన్నుల విధానాలు, సరఫరా-డిమాండ్ వంటి అంశాలు సిలిండర్ ధరలను ప్రభావితం చేస్తాయి.

For Latest News click here

Updated Date - Sep 01 , 2024 | 09:01 AM

Advertising
Advertising