Anant Ambani-Radhika Merchant Wedding: అనంత్-రాధిక పెళ్లి కోసం ముంబై చేరుకున్న.. ప్రియాంక చోప్రా, రామ్ చరణ్ సహా..
ABN, Publish Date - Jul 12 , 2024 | 07:18 AM
మరికొన్ని గంటల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి(Anant Ambani, Radhika Merchant wedding) చేసుకోబోతున్నారు. నేడు (జూలై 12న) ముంబై(mumbai) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరిద్దరి వివాహం జరగనుంది. ఇందుకోసం సెలబ్రెటీలు క్రమంగా ముంబైకి చేరుకుంటున్నారు. ఆ క్రమంలో వచ్చిన వీవీఐపీ అతిథులకు స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇప్పటివరకు ముంబై చేరుకున్న గెస్టుల వివరాలను ఇప్పుడు చుద్దాం.
మరికొన్ని గంటల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి(Anant Ambani, Radhika Merchant wedding) చేసుకోబోతున్నారు. నేడు (జూలై 12న) ముంబై(mumbai) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరిద్దరి వివాహం జరగనుంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలో పాల్గొనేందుకు భారతదేశం, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు పాల్గొననున్నారు. ఇందుకోసం సెలబ్రెటీలు క్రమంగా ముంబైకి చేరుకుంటున్నారు. ఆ క్రమంలో వచ్చిన వీవీఐపీ అతిథులకు స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇప్పటివరకు ముంబై చేరుకున్న గెస్టుల వివరాలను ఇప్పుడు చుద్దాం.
బాలీవుడ్ దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) అనంత్-రాధికల వివాహానికి హాజరయ్యేందుకు ముంబై(mumbai) చేరుకున్నారు. ఈరోజు జూలై 11న ప్రియాంక తన భర్త నిక్ జోనాస్ కూతురు మాల్తీతో కలిసి ముంబైకి చేరారు. ఆ క్రమంలో ముంబై విమానాశ్రయం వెలుపల ఫోటోలకు పోజులిచ్చిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. నిక్ జోనాస్ కూడా వైట్ కో ఆర్డ్ సెట్‌లో కనిపించారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా ముంబైకి తిరిగి వచ్చాడు. తెల్లటి రోల్స్ రాయిస్‌లో భద్రత నడుమ విమానాశ్రయం నుంచి బయలుదేరారు.
సౌత్ ఇండియా సూపర్ స్టార్, ఆర్ఆర్ఆర్ నటుడు రామ్ చరణ్(Ram Charan) ఫ్యామిలీతో ఈ వేడుక కోసం ముంబై చేరుకున్నారు. జూలై 11న హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన ముంబైకి బయలుదేరారు. ఆయనతోపాటు భార్య ఉపాసన కొణిదెల, కుమార్తె క్లీన్ కారా కూడా ఉన్నారు.
మరోవైపు అనంత్-రాధికల వివాహానికి హాజరయ్యేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(mamata banerjee) కూడా ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయం నుంచి సీఎం మమతా బెనర్జీ కారులో బయలుదేరుతున్న వీడియో కనిపించింది. ఈ పెళ్లి వేడుకకు దేశ, విదేశాల్లోని కీలక నేతలు కూడా హాజరుకానున్నారు.
ప్రధాని మోదీ కూడా..
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కి విదేశాల నుంచి చాలా మంది వీవీఐపీ అతిథులు కూడా వస్తుండగా, ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ(modi) కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ముంబైలోని కలీనా విమానాశ్రయం చేరుకున్నారు. దీంతోపాటు సామ్‌సంగ్ సీఈఓ హాన్ జోంగ్ హీ, అమెరికన్ స్టార్ పాప్ సింగర్ కిమ్ కర్దాషియాన్(Kim Kardashian) కూడా ఈ పెళ్లి వేడుక కోసం ముంబై చేరుకున్నారు. కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, టాంజానియా అధ్యక్షుడు సమియా సులుహు హసన్‌తో సహా పలువురు విదేశీ అతిథులు కూడా హాజరుకానున్నారు. ఈ పెళ్లి వేడుకలు జూలై 12 నుంచి 14 వరకు జరుగుతాయి.
ఇది కూడా చదవండి:
Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!
ఇంధన రంగంలో రూ.8.4 లక్షల కోట్ల పెట్టుబడి అవకాశాలు
భారత రియల్టీ మొఘల్ డీఎల్‌ఎఫ్ రాజీవ్ సింగ్
For Latest News and Business News click here
Updated Date - Jul 12 , 2024 | 11:34 AM