క్యూఐపీల రికార్డు
ABN, Publish Date - Dec 16 , 2024 | 05:23 AM
ఈ ఏడాదిలో నవంబరుతో ముగిసిన 11 నెల కాలంలో భారత కంపెనీలు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) మార్గం ద్వారా సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ఏకంగా రూ.1.21 లక్షల కోట్లు....
11 నెలల్లో రూ.1.21 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో నవంబరుతో ముగిసిన 11 నెల కాలంలో భారత కంపెనీలు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) మార్గం ద్వారా సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ఏకంగా రూ.1.21 లక్షల కోట్లు సమీకరించాయి. క్యూఐపీల ద్వారా వార్షిక నిధుల సమీకరణ రూ.లక్ష కోట్లు దాటడం ఇదే తొలిసారి అని ప్రైమ్ డేటాబేస్ వెల్లడించింది. గత ఏడాదిలో నమోదైన రూ.52,350 కోట్లతో పోలిస్తే, క్యూఐపీల ద్వారా నిధుల సేకరణ ఈ ఏడాది రెండింతలకు పైగా పెరిగింది. మార్కెట్లో మెరుగైన పరిస్థితులతో పాటు అధిక వేల్యూయేషన్లు ఇందుకు కలిసి వచ్చాయి. ప్రైమ్ డేటాబేస్ తాజా డేటా ప్రకారం.. ఈ ఏడాదిలో నవంబరు వరకు 82 కంపెనీలు క్యూఐపీల ద్వారా రూ.1,21,321 కోట్లు సమీకరించాయి. గత ఏడాదిలో ఇదే కాలానికి 35 ఇష్యూల ద్వారా రూ.38,220 కోట్ల సమీకరణ జరిగింది. లిస్టెడ్ కంపెనీలు, పెట్టుబడి ట్రస్టులు నియంత్రణ మండలికి ముందస్తుగా పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన నిధులు సమీకరించేందుకున్న మార్గాల్లో క్యూఐపీ ఒకటి.
మైనింగ్ దిగ్గజం వేదాంత, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో ఈ ఏడాది క్యూఐపీల ద్వారా అత్యధిక నిధులు సమీకరించిన కంపెనీలుగా నిలిచాయి. ఈ రెండూ చెరో రూ.8,500 కోట్లు సేకరించాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రూ.8,373 కోట్లు, వరుణ్ బెవరేజెస్ రూ.7,500 కోట్లతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ రూ.6,438 కోట్లు, గోద్రేజ్ ప్రాపర్టీస్ రూ.6,000 కోట్లు, కేఈఐ ఇండస్ట్రీస్ రూ.2,000 కోట్లు పోగేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), జేఎ్‌సడబ్ల్యూ ఎనర్జీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నెలలో టొరెంట్ పవర్, భారత్ ఫోర్జ్, సెన్కో గోల్డ్, సమ్మాన్ క్యాపిటల్ కూడా క్యూఐపీల ద్వారా రూ.8,000 కోట్లకు పైగా సేకరించాయి. ఏడాది చివరి నాటికి లెక్క మరింత పెరగనుంది.
మళ్లీ ఎఫ్‌పీఐల జోరు
గత రెండు నెలల్లో భారీగా అమ్మకాలు సాగించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎ్‌ఫపీఐ).. ఈ నెలలో మళ్లీ కొనుగోళ్ల జోరు పెంచారు. గడిచిన రెండు వారా ల్లో (డిసెంబరు 1 నుంచి 13 వరకు) ఎఫ్‌పీఐలు దేశీ య ఈక్విటీల్లో నికరంగా రూ.22,766 కోట్ల పెట్టుబడు లు పెట్టారు. అమెరికన్ సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీరేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాలు ఇందుకు దోహదపడ్డాయి. నవంబరులో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.21,612 కోట్ల నిధులు ఉపసంహరించుకున్నారు. అక్టోబరులోనైతే ఏకంగా రూ.94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మన మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐలు ఏదైనా నెలలో ఉపసంహరించుకున్న పెట్టుబడుల్లో ఇదే అత్యధికం. ఈ సెప్టెంబరులో మాత్రం ఎఫ్‌పీఐలు నికర పెట్టుబడులు తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయి రూ.57,724 కోట్లుగా నమోదయ్యా యి. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు మాత్రం రూ.7,747 కోట్లకు పరిమితమయ్యాయి. అక్టోబరు, నవంబరులో ఇన్వె్‌స్టమెంట్లు భారీ గా తరలిపోవడం ఇందుకు కారణం.
Updated Date - Dec 16 , 2024 | 05:23 AM