ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raymond Group: రేమండ్ గ్రూప్‌ సీఎండీకి రూ.328 కోట్ల ఫైన్..ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

ABN, Publish Date - Jan 10 , 2024 | 11:31 AM

బిలియనీర్, రేమండ్ గ్రూప్(Raymond Group) సీఎండీ గౌతమ్ సింఘానియా 328 కోట్ల రూపాయల ఫైన్ చెల్లించారు. అవును మీరు విన్నది నిజమే. అంతేకాదు ఎందుకు అంత మొత్తంలో ఫైన్ చెల్లించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

బిలియనీర్, రేమండ్ గ్రూప్(Raymond Group) సీఎండీ గౌతమ్ సింఘానియా(gautam singhania) 328 కోట్ల రూపాయల ఫైన్ చెల్లించారు. అవును మీరు విన్నది నిజమే. అంతేకాదు ఎందుకు అంతమొత్తంలో ఫైన్ చెల్లించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం. గౌతమ్ సింఘానియాకు చెందిన రేమండ్ గ్రూప్ 142 కార్ల దిగుమతిపై కస్టమ్ డ్యూటీ రూ.328 కోట్ల ఎగవేత జరిగిందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తెలిపింది. ఈ నేపథ్యంలోనే రేమండ్ గ్రూప్ రూ.328 కోట్లు చెల్లించి కేసును సెటిల్ చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.


గౌతమ్ సింఘానియాకు చెందిన రేమండ్ గ్రూప్ 142 కార్ల దిగుమతిపై కస్టమ్ డ్యూటీ ఎగవేత కేసును పరిష్కరించింది. అయితే రేమండ్ గ్రూప్ యూనిట్ అయిన JK ఇన్వెస్టర్స్ (Mumbai) లిమిటెడ్ చెల్లించిన మొత్తంలో వర్తించే వడ్డీ 15%, పెనాల్టీ మొదలైనవి కూడా ఉన్నాయి. గ్రూప్ కంపెనీల కార్లను కొనుగోలు చేసిన సందర్భాల్లో రేమండ్ గ్రూప్ CMD గౌతమ్ సింఘానియాను DRI లాభదాయకమైన యజమానిగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. DRI ప్రకారం 138 పాత కార్లు, 4 R&D వాహనాలు సోథెబీస్, బారెట్-జాక్సన్, బోన్‌హామ్స్ నుంచి కొనుగోలు చేసినట్లు వివరాలను వెల్లడించారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, యుఎస్‌లలో రిజిస్టర్ చేయబడిన మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా ఆ కార్లను తక్కువ విలువతో భారతదేశానికి తెచ్చుకున్నట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.229.72 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లిందని అధికారులు గుర్తు చేశారు. ఈ అంశంపై రేమండ్ గ్రూప్‌లో భాగమైన జెకె ఇన్వెస్టర్స్ (Mumbai) ప్రతినిధి మాట్లాడుతూ ఇది పాత కేసు అని ఇప్పటికే చెల్లించబడినట్లు చెప్పారు. DRI ప్రకారం 2018 నుంచి 2021 మధ్య వివిధ వేలం గృహాల నుంచి కొనుగోలు చేసిన కార్లు US, UK నుంచి నేరుగా భారతదేశానికి వచ్చాయని పేర్కొన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 11:32 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising