ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తగ్గిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లాభం

ABN, Publish Date - May 03 , 2024 | 05:48 AM

ఎయిర్‌పోర్టుల నుంచి డేటా సెంటర్ల వరకు విభిన్న రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లాభం మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 37 శాతం క్షీణించి...

ఎయిర్‌పోర్టుల నుంచి డేటా సెంటర్ల వరకు విభిన్న రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లాభం మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 37 శాతం క్షీణించి రూ.450.58 కోట్లకు పరిమితమైంది. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌పై రూ.627 కోట్ల బకాయిని ఏకకాలంలో చెల్లించడంతో పాటు కమర్షియల్‌ మైనింగ్‌లో ఏర్పడిన నష్టాలు లాభాన్ని ప్రభావితం చేసినట్టు కంపెనీ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.722.48 కోట్లు కాగా మూడో త్రైమాసిక లాభం రూ.188.45 కోట్లుంది. న్యూ ఎనర్జీ, విమానాశ్రయ వ్యాపారాల్లో మంచి వృద్ధి నమోదైనా కమర్షియల్‌ మైనింగ్‌ విభాగం రూ.201.83 కోట్లు నష్టం నమోదు చేసింది. ఇదిలా ఉండగా 2030 నాటికి దేశంలో 1 గిగావాట్‌ సామర్థ్యం గల 9 డేటా సెంటర్లు కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఎడ్జ్‌ కనెక్స్‌ జాయింట్‌ వెంచర్‌లో చెన్నై డేటా సెంటర్‌ ప్రస్తుతం పని చేస్తుండగా నోయిడా, హైదరాబాద్‌ డేటా సెంటర్ల నిర్మాణం 81-88 శాతం పూర్తయినట్టు కంపెనీ ప్రకటించింది.

Updated Date - May 03 , 2024 | 05:48 AM

Advertising
Advertising