Jio Diwali offer: పెరిగిన రీఛార్జ్‌లతో ఇబ్బంది పడుతున్న జియో యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్
ABN, Publish Date - Oct 30 , 2024 | 01:37 PM
టెలికం కంపెనీలన్ని మూడు నెలలక్రితం టారీఫ్ రేట్లను గణనీయంగా పెంచిన తర్వాత చాలా మంది సామాన్యులు రీఛార్జ్ చేపించు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల యూజర్లే కాకుండా ఫీచర్ ఫోన్ల కస్టమర్లు కూడా ధరల భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జియో ఒక ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
భారీగా పెరిగిపోయిన రీఛార్జ్ రేట్లతో సతమతం అవుతున్న యూజర్లకు గుడ్‌న్యూస్ వచ్చింది. దీపావళి వేళ జియోఫోన్ (JioPhone) యూజర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలు పొందేందుకు వీలుగా సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లతో ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది జియోఫోన్ యూజర్లకు పెద్ద ఉపశమనం దక్కింది.
రూ.153 రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. జియోపై అందుబాటులో ఉన్న చౌవకైన ప్లాన్లలో ఒకటిగా నిలిచింది. ఈ ప్లాన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తం 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. 0.5జీబీ రోజువారీ డేటా కూడా లభిస్తుంది. అంటే నెలకు14జీబీల డేటాను పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్ విషయానికి వస్తే సినిమాలు, స్పోర్ట్స్ లైవ్స్‌ను వినియోగదారులు ఆస్వాదించవచ్చు. జియో టీవీ, జియో సినిమాల సబ్‌స్ర్కిప్షన్‌లను ఉచితంగా పొందవచ్చు.
సరసమైన రూ.153 రీఛార్జ్ ప్లాన్‌తో పాటు యూజర్ల అవసరాలను బట్టి మరిన్ని చౌవకమైన ప్రత్యేక ప్లాన్లను కూడా తక్కువ రేటుకే అందించింది. ఈ ప్లాన్ల జాబితాలో రూ.75, రూ.91, రూ.125, రూ.186, రూ.223 ఉన్నాయి. ఈ ప్లాన్‌లు వినియోగదారుల వివిధ అవసరాలను బట్టి ఉపయోగపడతాయి. అయితే ఈ తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్‌లు జియోఫోన్ (JioPhone) యూజర్లకు మాత్రమే ఉంది. కాబట్టి స్మార్ట్‌ఫోన్ యూజర్లు రూ.153 ప్లాన్ ప్రయోజనాలను పొందలేరు. కాగా జూన్ నెలలో రీఛార్జ్ రేట్లు గణనీయంగా పెరిగాయి. దీంతో రీఛార్జ్ చేసుకునేందుకు కస్టమర్లు వెనక్కి జంకుతున్నారు. అందుకే ఈ బడ్జెట్ ధరలో ఈ ఆఫర్లను జియో ప్రవేశపెట్టింది.
ఇవి కూడా చదవండి
నవంబర్‌లో బ్యాంకులకు చాలా హాలిడేస్.. ఎప్పుడెప్పుడంటే
ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూక్లియర్ డ్రిల్ మొదలు పెట్టిన రష్యా.. ఏం జరగబోతోంది
ఇరాన్‌కు సంచలన వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్.. టెన్షన్ టెన్షన్
పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులకు ప్రధాని మోదీ క్షమాపణలు.. కారణం ఎందుకంటే..
For more Business News and Telugu News
Updated Date - Oct 30 , 2024 | 01:38 PM