UCO Bank Scam: యూకో బ్యాంక్‌లో రూ.820 కోట్ల స్కాం.. 67 ప్రాంతాల్లో సీబీఐ దాడులు
ABN, Publish Date - Mar 07 , 2024 | 04:24 PM
దేశంలో గతంలో ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్ వంటి పేర్లతో అనేక స్కామ్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా యూకో బ్యాంక్ కుంభకోణం విషయంలో సీబీఐ అధికారులు 67 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ స్కాం వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశంలో గతంలో ఐసీఐసీఐ(ICICI), ఎస్ బ్యాంక్(Yes bank) వంటి పేర్లతో అనేక స్కామ్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో బ్యాంక్ కుంభకోణం విషయంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. యూకో బ్యాంక్(UCO Bank)లో రూ.820 కోట్ల ఐఎంపీఎస్(IMPS) స్కామ్‌కు సంబంధించి అధికారులు రాజస్థాన్, మహారాష్ట్రలోని ఏడు నగరాల్లోని 67 చోట్ల ఈరోజు సోదాలు చేశారు. యూకో బ్యాంక్ ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ(SBI) 2023 నవంబర్ 21న కేసు నమోదు చేసింది.
ఫిర్యాదు ప్రకారం నవంబర్ 10 నుంచి నవంబర్ 13, 2023 మధ్య, ఏడు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 14,600 మంది ఖాతాదారులు, UCO బ్యాంక్‌లోని 41,000 మంది ఖాతాదారుల ఖాతాలలో రూ.820 కోట్ల IMPS లావాదేవీలను తప్పుగా నమోదు చేశారు. ఆ సందర్భంలో మొత్తం ఖాతాలలో నగదు జమ చేయబడినా కూడా మరోవైపు ఆ మొత్తం బదిలీ చేయబడిన ఖాతాల నుంచి ఎటువంటి నగదు డెబిట్ కాలేదు. దీంతో డబ్బులు పడ్డాయని తెలిసిన చాలా మంది ఖాతాదారులు వారి ఖాతాలలోని ఆకస్మిక మొత్తాన్ని విత్‌డ్రా కూడా చేసుకున్నారు.
ఆ క్రమంలో డిసెంబర్ 2023లో కోల్‌కతా, మంగళూరులో ప్రైవేట్ బ్యాంక్ హోల్డర్లు, యూకో బ్యాంక్ అధికారుల 13 స్థానాలపై సీబీఐ(CBI) దాడులు చేసింది. ఈ తర్వాత 2024 మార్చి 6న జోధ్‌పూర్, జైపూర్, జలోర్, నాగ్‌పూర్, బార్మెడ్, రాజస్థాన్‌లోని పలాడి, మహారాష్ట్రలోని పూణేలో కూడా సీబీఐ దాడులు నిర్వహించింది. దాడుల్లో 40 మొబైల్ ఫోన్లు, 2 హార్డ్ డిస్క్‌లు, ఇంటర్నెట్ డాంగిల్ సహా యూకో బ్యాంక్, ఐడీఎఫ్‌సీ(IDFC) బ్యాంకులకు సంబంధించిన 130 అనుమానాస్పద పత్రాలు, 43 డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు.
మరో 30 మంది అనుమానిత వ్యక్తులను అక్కడికక్కడే పరిశీలించారు. దాడుల సమయంలో శాంతిభద్రతలు క్షీణించకుండా చూసేందుకు, సాయుధ బలగాలతో సహా 120 మంది రాజస్థాన్ పోలీసులను కూడా చేర్చారు. 130 మంది సీబీఐ అధికారులతో సహా 210 మందితో కూడిన 40 బృందాలు 80 మంది ప్రైవేట్ సాక్షులు, వివిధ విభాగాలకు చెందిన వ్యక్తులను కూడా ఆపరేషన్‌లో చేర్చారు. IMPS మొత్తం అనుమానాస్పద లావాదేవీపై ప్రస్తుతం సీబీఐ(CBI) దర్యాప్తు చేస్తోంది. అయితే అలా ఎందుకు జరిగింది, ఎక్కడ లోపం ఉంది, ఎవరైనా కావాలనే చేశారా, లేదా సాంకేతిక లోపం కారణంగా తలెత్తిందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Narendra Modi: వెడ్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రజలు పాటించాలి
Updated Date - Mar 07 , 2024 | 04:24 PM