ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.5.29 లక్షల కోట్లు ఫట్

ABN, Publish Date - Nov 13 , 2024 | 04:22 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు మంగళవారం భారీ గా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 79,000, నిఫ్టీ 24,000 స్థాయిలను కోల్పోయాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో...

భారీగా తగ్గిన స్టాక్‌ మార్కెట్‌ సంపద

సెన్సెక్స్‌ 821 పాయింట్ల పతనం

  • 23,900 దిగువకి నిఫ్టీ

  • బ్యాంకింగ్‌, పవర్‌, ఆటో షేర్లు విలవిల

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు మంగళవారం భారీ గా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 79,000, నిఫ్టీ 24,000 స్థాయిలను కోల్పోయాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకిం గ్‌, పవర్‌, వాహన రంగ షేర్లలో భారీగా అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణం. ఒక దశలో 948 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్‌.. చివరికి 820.97 పాయింట్ల (1.03 శాతం) నష్టంతో 78,675.18 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 257.85 పాయింట్లు (1.07 శాతం) పతనమై 23,883.45 వద్ద ముగిసింది.


సూచీ నష్టపోవడం ఇది నాలుగో రోజు. అమ్మకాల హోరులో స్టాక్‌ మార్కెట్‌ సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5.29 లక్ష కోట్లకు పైగా తగ్గి రూ.437.24 లక్షల కోట్లకు (5.18 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. మరిన్ని ముఖ్యాంశాలు..

  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 24 నష్టాలు చవిచూశాయి. ఎన్‌టీపీసీ షేరు 3.16 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, మారుతి సుజుకీ, జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు రెండు శాతానికి పైగా నష్టపోయాయి.


  • బీఎ్‌సఈలోని చిన్న, మధ్య స్థాయి కంపెనీల ప్రాతినిథ్య సూచీలైన స్మాల్‌క్యాప్‌ 1.26 శాతం, మిడ్‌క్యాప్‌ 0.98 శాతం తగ్గాయి. రంగాలవారీ సూచీల్లో పవర్‌ 2.79 శాతం, యుటిలిటీస్‌ 2.20 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 2.14 శాతం నష్టపోయాయి. ఆటో, ఇండస్ట్రియల్స్‌, మెటల్‌ ఇండెక్స్‌లు 1.95 శాతం వరకు విలువను కోల్పోయాయి. రియల్టీ, ఐటీ సూచీలు మాత్రం లాభపడ్డాయి.

  • బీఎ్‌సఈలో 4,061 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 2,791 నష్టపోయాయి. 1,181 కంపెనీల స్టాక్‌ లాభపడగా.. 89 యథాతథంగా ముగిశాయి. 71 కంపెనీల షేర్లు సరికొత్త ఏడాది కనిష్ఠానికి జారుకున్నాయి.

  • ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక పైసా తగ్గి సరికొత్త జీవిత కాల గరిష్ఠ స్థాయి 84.39 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు పీపా ధర ఒక దశలో 0.56 శాతం పెరిగి 72.23 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

Updated Date - Nov 13 , 2024 | 04:22 AM