ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.6 లక్షల కోట్లు ఉఫ్‌

ABN, Publish Date - Nov 05 , 2024 | 04:17 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు సోమవారం కుప్పకూలాయి. సెనెక్స్‌ ఒక దశలో 1,491.52 పాయింట్లు పతనమై 78,232.60 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 941.88 పాయింట్ల (1.18 శాతం) నష్టంతో 78,782.24 వద్ద స్థిరపడింది. సూచీకి దాదాపు...

భారీగా పతనమైన మార్కెట్‌.. 3 నెలల కనిష్ఠానికి సూచీలు

  • ఒక దశలో 1,492 పాయింట్లు కోల్పోయిన బీఎ్‌సఈ సెన్సెక్స్‌

  • చివరికి 942 పాయింట్ల నష్టంతో 78,782 వద్ద ముగిసిన సూచీ

  • 24,000 దిగువ స్థాయికి నిఫ్టీ

  • దాదాపు 3% క్షీణించిన ఆర్‌ఐఎల్‌

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు సోమవారం కుప్పకూలాయి. సెనెక్స్‌ ఒక దశలో 1,491.52 పాయింట్లు పతనమై 78,232.60 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 941.88 పాయింట్ల (1.18 శాతం) నష్టంతో 78,782.24 వద్ద స్థిరపడింది. సూచీకి దాదాపు రెండు నెలల (ఆగస్టు 6 తర్వాత) కనిష్ఠ ముగింపు స్థాయి ఇది. నిఫ్టీ విషయానికొస్తే, ఒక దశలో 488 పాయింట్ల వరకు క్షీణించి 23,800 స్థాయికి జారుకుంది. చివరి గంటలో కాస్త తేరుకుని 309 పాయింట్ల (1.27 శాతం) నష్టంతో 23,995.35 వద్ద క్లోజైంది. దాంతో సూచీ 24,000 కీలక స్థాయిని చేజార్చుకున్నట్లైంది. అమ్మకాల హోరులో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5.99 లక్షల కోట్లు తగ్గి రూ.442.11 లక్షల కోట్లకు (5.26 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. మరిన్ని ముఖ్యాంశాలు..


  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 24 నష్టపోయాయి. అదానీ పోర్ట్స్‌ షేరు 3.23 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేరు 2.77 శాతం పతనమవడంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కరోజే రూ.50,205 కోట్లు తగ్గి రూ.17.62 లక్షల కోట్లకు పడిపోయింది. మార్కెట్లో అధిక వెయిటేజీ కలిగిన మరో షేరు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ సైతం 1.37 శాతం క్షీణించడం సెన్సెక్స్‌, నిఫ్టీ భారీ నష్టాలకు ప్రధాన కారణమయ్యాయి.

నష్టాలకు కారణాలు

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై అనిశ్చితి

  • ఈ వారంలో యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాడ్‌ (బీఓఈ) ద్రవ్యపరపతి సమీక్ష నిర్ణయాలు ప్రకటించనున్న నేపథ్యంలో అప్రమత్తత

  • విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎ్‌ఫపీఐ) పెట్టుబడులు తరలిపోతుండటం

  • సెప్టెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌ ఆశాజనకంగా లేకపోవడం

  • అధిక ధరల వద్ద ట్రేడవుతున్న షేర్లలో మదుపరులు లాభాలు స్వీకరించడం


5 వారాల్లో 7,200 పాయింట్లు డౌన్‌

ఈ సెప్టెంబరు 27న 85,978 పాయింట్ల వద్ద ఆల్‌టైం రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌.. ఆ తర్వాత తిరోగమన బాట పట్టింది. గడిచిన ఐదు వారాల్లో లేదా 25 ట్రేడింగ్‌ సెషన్లలో సూచీ 7,196 పాయింట్లు నష్టపోయింది.

భారత కరెన్సీ విలువ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 4 పైసల నష్టంతో 84.11 వద్ద ముగిసింది. మన ఈక్విటీ మార్కెట్లో భారీ నష్టాలు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంతో పాటు ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకడం రూపాయి విలువకు గండికొట్టాయని ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.


సరికొత్త కనిష్ఠానికి రూపాయి

అఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌..

నష్టాల్లో నమోదై లాభాల్లోకి..

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన అఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సోమవారం షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.463తో పోలిస్తే, బీఎ్‌సఈలో కంపెనీ షేరు 7.11 శాతం నష్టంతో రూ.430.05 వద్ద ట్రేడింగ్‌ ఆరంభించింది. ఒక దశలో 9.31 శాతం క్షీణించి రూ.419.85 వద్దకు జారుకున్నప్పటికీ.. తిరిగి పుంజుకుని లాభాల్లోకి మళ్లింది. తొలి రోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి కంపెనీ షేరు 2.49 శాతం లాభంతో రూ.474.55 వద్ద స్థిరపడింది.

Updated Date - Nov 05 , 2024 | 04:17 AM