భారత్ ద్వారా ఈయూకు రష్యా చమురు
ABN, Publish Date - Nov 11 , 2024 | 02:34 AM
చమురు ఎగుమతులపై జీ-7, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు విధించినఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా కొత్త మార్గం కనిపెట్టింది. భారత రిఫైనరీలకు పెద్దమొత్తంలో ముడి చమురు ఎగుమతి చేస్తూ..
న్యూఢిల్లీ: చమురు ఎగుమతులపై జీ-7, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు విధించినఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా కొత్త మార్గం కనిపెట్టింది. భారత రిఫైనరీలకు పెద్దమొత్తంలో ముడి చమురు ఎగుమతి చేస్తూ.. దాని నుంచి వచ్చే డీజిల్, విమాన ఇంధనాలను ఈయూ దేశాలకు ఎగుమతి చేస్తోంది. రష్యా చమురుతో తయారు చేసే తుది ఉత్పత్తుల ఎగుమతిపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం ఇందుకు కారణం. ఈ ఏడాది తొలి మూడు త్రైమాసికాల్లో ఈయూ దేశాలకు భారత డీజిల్, విమాన ఇంధనాల ఎగుమతి 58 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. ఇందులో ఎక్కువ భాగం డిస్కౌంట్‌తో రష్యా సరఫరా చేసిన ముడి చమురు నుంచి ఉత్పత్తి చేశారని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ) ఒక నివేదికలో తెలిపింది.
Updated Date - Nov 11 , 2024 | 02:34 AM