SBI FD vs Post Office TD: వీటిలో ఏది బెస్టో తెలుసా?
ABN, Publish Date - Jan 08 , 2024 | 04:28 PM
మీరు మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ లేదా SBI FD వీటిలో ఏది బెస్ట్ అని తేల్చుకోలేకపోతున్నారా. అయితే ఈ వార్త చదవండి. మీకు ఎందులో పెట్టుబడి పెట్టాలనేది క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో అనేక పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఎంపికలలో అధిక రాబడి ఉంటుంది. కానీ వీటిలో రిస్క్ ఎక్కువ. కాబట్టి అనేక మంది వ్యక్తులు SBI FD లేదా పోస్టాఫీస్ TD స్కీమ్స్ వంటి సురక్షితమైన పెట్టుబడి పథకాలపై మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి క్రమంలో ఈ రెండెంటీలో మీరు మూడేళ్లపాటు పెట్టుబడి పెట్టాలని చూస్తే ఏది బెస్ట్ అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచింది. టర్మ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం 10 బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే మూడేళ్ల కాలంలో వడ్డీ రేటును 7 శాతం నుంచి 7.10 శాతానికి పెంచారు. కొత్త వడ్డీ రేట్లు జనవరి 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. ఇవి మార్చి 31, 2024 వరకు కొనసాగుతాయి. మరోవైపు రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీ రేట్లు పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ఇటివల ప్రకటించింది. వివిధ పదవీకాల FDలపై 25 బేసిస్ పాయింట్ల పెరుగుదల ఉంది.
ఈ నేపథ్యంలో సాధారణ పౌరులకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలానికి 6.75 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ క్రమంలో మీరు SBI FD లేదా పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది కాబట్టి ఈ ఎంపిక బెస్ట్ అని చెప్పవచ్చు.
Updated Date - Jan 08 , 2024 | 04:38 PM