ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SBI: ఎస్బీఐ నుంచి మరో స్కీం..దీని ప్రత్యేకతలివే

ABN, Publish Date - Jan 13 , 2024 | 11:16 AM

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు నిధుల కోసం గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు) సహా వ్యక్తులందరికీ ఈ పథకం అందుబాటులో ఉందని బ్యాంక్ తెలిపింది.

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి మరో స్కీం అందుబాటులోకి వచ్చింది. పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల నిధుల సేకరణ కోసం గ్రీన్ రూపాయి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ (SGRTD)ను శుక్రవారం ఈ మేరకు ప్రారంభించారు. దీని ద్వారా సాధారణ కస్టమర్ల నుంచి సంపన్నుల కుటుంబ కార్యాలయాలు సహా పలు యూనిట్ల నుంచి SBI నిధులను సేకరించనుంది. 1,111 రోజులు, 1,777 రోజులు, 2,222 రోజులు మూడు వేర్వేరు కాలవ్యవధుల నుంచి ఎంచుకోవడానికి పెట్టుబడిదారులకు సౌకర్యాన్ని అందిస్తుంది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Bank Holidays: ఒకే నెలలో సంక్రాంతి, రిపబ్లిక్ డే.. హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు

RBI నోటిఫికేషన్ ప్రకారం గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది ఒక రకమైన ఫిక్స్‌డ్ టర్మ్ డిపాజిట్. దీనిలో పెట్టుబడిదారులు తమ డబ్బును పర్యావరణ ప్రయోజనాల కోసం ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి పెడతారు. ఈ ప్రాజెక్టులలో పునరుత్పాదక శక్తి, ఇంధన సామర్థ్యం, నీటి సంరక్షణ, కాలుష్య నియంత్రణ సహా అనేకం ఉంటాయి. ప్రస్తుతం ఈ పథకం బ్రాంచ్ నెట్‌వర్క్ ద్వారా అందుబాటులో ఉంది. త్వరలో ఇది 'YONO' యాప్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ మాధ్యమాలలో కూడా అందుబాటులో ఉంటుందని SBI ఛైర్మన్ దినేష్ ఖరా తెలిపారు.

గ్రీన్ డిపాజిట్ ప్రయోజనాలు

-గ్రీన్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడిదారులు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తారు

-ఇది పెట్టుబడికి సురక్షితమైన ఎంపిక, ఎందుకంటే ఇది బ్యాంకు డిపాజిట్

-గ్రీన్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సాధారణంగా సాంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉంటాయి

SBI గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభించడం మాకు సంతోషంగా ఉందని SBI చైర్మన్ దినేష్ ఖరా అన్నారు. దేశంలో స్థిరమైన ఆర్థిక వ్యవస్థ పట్ల తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వినూత్న స్కీం ద్వారా 2070 నాటికి దేశాన్ని కార్బన్ జీరోగా మార్చాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అందరికీ పచ్చదనం, పర్యావరణ బాధ్యతతో కూడిన ఆర్థిక భవిష్యత్తును అందించాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Jan 13 , 2024 | 11:16 AM

Advertising
Advertising