ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పబ్లిక్‌ ఇష్యూలకు సెక్యూరిటీ డిపాజిట్‌ రద్దు

ABN, Publish Date - Nov 22 , 2024 | 05:35 AM

పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చే కంపెనీలకు సెబీ మరో వెసులుబాటు కల్పించింది. ఈ కంపెనీలు ఐపీఓలు, రైట్స్‌ ఇష్యూల ద్వారా సేకరించే నిధుల్లో ఒక శాతాన్ని తప్పనిసరిగా ముందుగానే స్టాక్‌ ఎక్స్చేంజిల వద్ద డిపాజిట్‌...

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చే కంపెనీలకు సెబీ మరో వెసులుబాటు కల్పించింది. ఈ కంపెనీలు ఐపీఓలు, రైట్స్‌ ఇష్యూల ద్వారా సేకరించే నిధుల్లో ఒక శాతాన్ని తప్పనిసరిగా ముందుగానే స్టాక్‌ ఎక్స్చేంజిల వద్ద డిపాజిట్‌ చేయాలన్న నిబంధనను తొలగించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఏఎస్‌బీఏ, యూపీఐ చెల్లింపులు, అలాట్‌ అయిన షేర్లు తప్పనిసరిగా డిమ్యాట్‌ ఖాతాల్లోనే జమ చేయడం వంటి సంస్కరణల నేపథ్యంలో, మారిన మార్కెట్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. దీనికి సంబంధించి సెబీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఒక చర్చా పత్రం విడుదల చేసింది. దానిపై వచ్చిన సలహాలు, సూచనలతో ఈ తాజా నిర్ణయం తీసుకుంది.

Updated Date - Nov 22 , 2024 | 05:35 AM