Sensex : సెన్సెక్స్ @ 77,000
ABN, Publish Date - Jun 11 , 2024 | 04:46 AM
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సోమవారం ఆరంభ ట్రేడింగ్‌లో సరికొత్త ఉన్నత శిఖరాలను చేరాయి. సెన్సెక్స్ తొలిసారిగా 77,000 మైలురాయిని
ముంబై: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సోమవారం ఆరంభ ట్రేడింగ్‌లో సరికొత్త ఉన్నత శిఖరాలను చేరాయి. సెన్సెక్స్ తొలిసారిగా 77,000 మైలురాయిని దాటగా.. నిఫ్టీ 23,400 ఎగువకు చేరింది. సెన్సెక్స్ 385.68 పాయింట్ల లాభంతో 77,079.04 వద్ద, నిఫ్టీ 121.75 పాయింట్ల వృద్ధితో 23,411.90 వద్ద సరికొత్త ఆల్‌టైం ఇంట్రాడే రికార్డులను నమోదు చేశాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా దిగ్గజ షేర్లలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు ఐటీ రంగ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ టంతో సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే, సెన్సెక్స్ 203.28 పాయింట్ల నష్టంతో 76,490.08 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30.95 పాయింట్లు కోల్పోయి 23,259.20 వద్ద క్లోజైంది. ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.425.22 లక్షల కోట్లు (5.09 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో సగం లాభపడ్డాయి. అలా్ట్రటెక్ సిమెంట్ షేరు 3.52 శాతం వృద్ధితో సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. పవర్‌గ్రిడ్ 2 శాతానికి పైగా రాణించింది. ఐటీ రంగానికి చెందిన టెక్ మహీంద్రా 2.72 శాతం, ఇన్ఫోసిస్ 2.20 శాతం, విప్రో 1.95 శాతం, టీసీఎస్ 0.94 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.88 శాతం క్షీణించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 0.75 శాతం నష్టపోయింది. బీఎస్‌ఈలోని స్మాల్‌క్యాప్ సూచీ మాత్రం 1.04 శాతం వృద్ధి చెందగా.. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.56 శాతం బలపడింది. రంగాల వారీ సూచీల్లో సేవలు, రియల్టీ, కమోడిటీస్, యుటిలిటీస్ ఒక శాతానికి పైగా పెరగగా.. ఐటీ, ఆటో, మెటల్, టెక్ సూచీలు మాత్రం నేలచూపులు చూశాయి. ఫారెక్స్ మార్కెట్ విషయానికొస్తే, డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు క్షీణించి 83.50 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లో నష్టాలతోపాటు అంతర్జాతీయంగా డాలర్ బలపడటం ఇందుకు కారణమైంది.
ప్రత్యేక రసాయనాల తయారీ సంస్థ క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ తన షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.136తో పోలిస్తే, బీఎస్‌ఈలో కంపెనీ షేరు 21.32 శాతం ప్రీమియంతో రూ.165 వద్ద లిస్టయింది. తొలిరోజు ట్రేడింగ్ ముగిసేసరికి, కంపెనీ షేరు 17.16 శాతం లాభంతో రూ.159.35 వద్ద స్థిరపడింది.
లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిసిన సూచీ
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) తన ఎండీ, సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ పెట్టుబడి సలహాలు ఇస్తున్నట్లుగా రూపొందించిన డీప్ ఫేక్ వీడియోలపై ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ఈ వీడియో లు నిజం కాదని, వాటిని నమ్మవద్దని.. ఆ వీడియోల్లోని పెట్టుబడి సలహాలను పాటించవద్దని తాజా ప్రకటనలో పేర్కొంది. ఎన్‌ఎ్‌సఈ ఉద్యోగులు, అధికారులెవ్వరూ స్టాక్స్ ను సిఫారసు చేయరని స్పష్టం చేసింది.
Updated Date - Jun 11 , 2024 | 04:46 AM