ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సెన్సెక్స్‌ 236 పాయింట్లు పతనం

ABN, Publish Date - Dec 13 , 2024 | 02:34 AM

ప్రామాణిక ఈక్విటీ సూచీలు గురువారం నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్‌ 236.18 పాయింట్లు కోల్పోయి 81,289.96 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 93.10 పాయింట్ల నష్టంతో 24,548.70 వద్ద స్థిరపడింది...

ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు గురువారం నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్‌ 236.18 పాయింట్లు కోల్పోయి 81,289.96 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 93.10 పాయింట్ల నష్టంతో 24,548.70 వద్ద స్థిరపడింది. ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాల విడుదల నేపథ్యంలో మదుపరులు ముందుజాగ్రత్తగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌యూఎల్‌ సహా పలు బ్లూచిప్‌ కంపెనీల షేర్లలో అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రూపాయి క్షీణత, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ అంశాలూ మార్కెట్‌ సెంటిమెంట్‌ను కుంగదీశాయి. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 18 నష్టాల్లో ముగిసాయి.


  • భారత కరెన్సీ సరికొత్త ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 5 పైసల నష్టంతో రూ.84.88 వద్ద ముగిసింది. డాలర్‌ బలోపేతం, ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, ముడి చమురు ధరల పెరుగుదల ఇందుకు కారణమయ్యాయి.

  • అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో బ్రెంట్‌ ముడిచమురు పీపా ధర ఒక దశలో 0.30 శాతం పెరిగి 73.74 డాలర్లకు ఎగబాకింది.

Updated Date - Dec 13 , 2024 | 02:34 AM