ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

83,000పైకి సెన్సెక్స్‌

ABN, Publish Date - Sep 18 , 2024 | 01:28 AM

ప్రామాణిక ఈక్విటీ సూచీలు సరికొత్త ఉన్నత శిఖరాలను చేరుకున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 90.88 పాయింట్ల లాభంతో 83,079.66 వద్ద, నిఫ్టీ 34.80 పాయింట్ల వృద్ధితో....

25,400 ఎగువ స్థాయికి నిఫ్టీ .. సరికొత్త శిఖరాలకు సూచీలు

ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు సరికొత్త ఉన్నత శిఖరాలను చేరుకున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 90.88 పాయింట్ల లాభంతో 83,079.66 వద్ద, నిఫ్టీ 34.80 పాయింట్ల వృద్ధితో 25,418.55 వద్ద ఆల్‌టైం రికార్డు ముగింపును నమోదు చేశాయి. అంతేకాదు, సెన్సెక్స్‌ 83,000, నిఫ్టీ 25,400 ఎగువన స్థిరపడటం కూడా ఇదే తొలిసారి. సూచీలు వరుసగా రెండో రోజు పాజిటివ్‌ జోన్‌లోనే కొనసాగినప్పటికీ, అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనున్న నేపథ్యంలో పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో సగం లాభపడ్డాయి. ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, ఎం అండ్‌ ఎం షేర్లు ఒక శాతానికి పైగా పెరిగాయి. కాగా, బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు 0.13 శాతం వరకు తగ్గాయి. రంగాలవారీ సూచీల్లో రియల్టీ, టెలికాం, యుటిలిటీస్‌, టెక్‌, ఆటో స్వల్పంగా లాభపడ్డాయి. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పెరిగి 83.76 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు పీపా ధర ఒకదశలో 0.25 శాతం తగ్గి 72.52 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.


  • స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో సోమవారం లిస్టయిన బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు వరుసగా రెండో రోజు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. తాజా సెషన్‌లో కంపెనీ షేరు ధర మరో 10 శాతం పెరిగి రూ.181.48కి చేరుకుంది. ఐపీఓ ధర రూ.70తో పోలిస్తే, మొదటి రెండ్రోజుల్లోనే షేరు 159 శాతం పుంజుకుంది.

  • ఓలా ఎలక్ట్రిక్‌ షేరు ఇంట్రాడేలో 10 శాతం పెరిగి అప్పర్‌ సర్క్యూట్‌ స్థాయి రూ.118.40 వద్దకు చేరుకుంది. చివరికి 9.71 శాతం వృద్ధితో రూ.118.10 వద్ద స్థిరపడింది. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఈ కంపెనీ షేరు కొనుగోలుకు సిఫారసు చేయడం ఇందుకు దోహదపడింది.

  • పీఎన్‌ గాడ్గిల్‌ జువెలర్స్‌ లిస్టింగ్‌కూ భారీ స్పందన లభించింది. ఐపీఓ ధర రూ.480తో పోలిస్తే, బీఎ్‌సఈలో కంపెనీ షేరు 73.75 శాతం ప్రీమియంతో రూ.834 వద్ద ట్రేడింగ్‌ ఆరంభించింది. తొలిరోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి షేరు 65.16ు లాభంతో రూ.792.80 వద్ద స్థిరపడింది.

Updated Date - Sep 18 , 2024 | 01:28 AM

Advertising
Advertising