ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సెన్సెక్స్‌79,000 పైకి.. 24,000 స్థాయికి నిఫ్టీ

ABN, Publish Date - Jun 28 , 2024 | 04:14 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లో గురువారం రికార్డుల మోత మోగింది. వరుసగా నాలుగో రోజూ ర్యాలీ తీసిన ప్రామాణిక సూచీలు సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్‌ తొలిసారిగా 79,000 మైలురాయిని చేరగా...

  • సరికొత్త ఉన్నత శిఖరాలకు సూచీలు

  • నాలుగో రోజూ లాభాల బాటలో మార్కెట్‌

  • రూ.438.41 లక్షల కోట్లకు మదుపరుల సంపద

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో గురువారం రికార్డుల మోత మోగింది. వరుసగా నాలుగో రోజూ ర్యాలీ తీసిన ప్రామాణిక సూచీలు సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్‌ తొలిసారిగా 79,000 మైలురాయిని చేరగా.. నిఫ్టీ 24,000 మార్క్‌ ను దాటింది. మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సతో పాటు ఐటీ కంపెనీలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లలో కొనుగోళ్లు సూచీలను మరింత ముందుకు నడిపించాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 721.78 పాయింట్లు ఎగబాకి 79,396.03 వద్ద సరికొత్త ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. ట్రేడింగ్‌ నిలిచేసరికి, సూచీ 568.93 పాయింట్ల లాభంతో 79,243.18 వద్ద స్థిరపడింది. సూచీకిది సరికొత్త జీవితకాల గరిష్ఠ ముగింపు కూడా. నిఫ్టీ సైతం ఒక దశలో 218.65 పాయింట్ల వృద్ధితో 24,087.45 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును, చివర్లో 175.70 పాయింట్ల లాభంతో 24,044.50 వద్ద కొత్త జీవిత కాల గరిష్ఠ ముగింపును నమోదు చేసింది.


ఈ మంగళవారం 78,000 స్థాయికి చేరిన సెన్సెక్స్‌.. కేవలం రెండు ట్రేడింగ్‌ సెషన్లలోనే మరో 1,000 పాయింట్ల మేర పుంజుకుంది. గత నెల 24న తొలిసారిగా 23,000 మైలురాయిని తాకిన నిఫ్టీ, కేవలం 23 ట్రేడింగ్‌ సెషన్లలో మరో 1,000 పాయింట్లు వృద్ధిని కనబరిచింది. మార్కెట్‌ జైత్రయాత్రలో ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సైతం సరికొత్త జీవిత కాల గరిష్ఠ స్థాయి రూ.438.41 లక్షల కోట్లకు (5.25 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. గడిచిన నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 2,033.28 పాయింట్లు (2.63 శాతం) పుంజుకోగా.. మార్కెట్‌ సంపద రూ.3.93 లక్షల కోట్లు పెరిగింది.

వచ్చే నెల 3 నుంచి ఎమ్‌క్యూర్‌ ఫార్మా ఐపీఓ

అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం బెయిన్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు కలిగిన ఎమ్‌క్యూర్‌ ఫార్మా తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) వచ్చేనెల 3న ప్రారంభమై 5న ముగియనుంది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.800 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారులకు చెందిన 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిన విక్రయించనుంది. వచ్చేనెల 10న కంపెనీ తన షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసే అవకాశం ఉంది.


జేపీ మోర్గాన్‌ బాండ్‌ ఇండెక్స్‌లోకి

భారత ప్రభుత్వ సెక్యూరిటీలు

భారత ప్రభుత్వ బాండ్లు (జీ-సెక్‌) శుక్రవారం నుంచి జేపీ మోర్గాన్‌-ఎమర్జింగ్‌ మార్కెట్‌ బాండ్‌ ఇండెక్స్‌లో భాగం కానున్నాయి. వచ్చే 10 నెలల (2024 జూన్‌ 28 నుంచి 2025 మార్చి 31) కాలంలో ఈ సూచీలో చేరనున్నాయి. నెలకు ఒక శాతం చొప్పున పది నెలల్లో గరిష్ఠంగా సూచీలో 10 శాతం వెయిటేజీ వరకు భారత జీ-సెక్‌లను సూచీలో చేర్చనున్నారు. తద్వారా వచ్చే పది నెలల్లో మన ప్రభుత్వ బాండ్లలోకి కనీసం 2,000-2,500 కోట్ల డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు రావచ్చని అంచనా. దాంతో మన జీ-సెక్‌ల రేట్లు తగ్గడంతో ప్రభుత్వానికి రుణ సమీకరణ వ్యయం కూడా తగ్గనుందని విశ్లేషకులు పేర్కొన్నారు.

Updated Date - Jun 28 , 2024 | 04:14 AM

Advertising
Advertising