ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిన్న షేరు.. భారీ లాభం

ABN, Publish Date - Jul 18 , 2024 | 04:40 AM

స్టాక్‌ మార్కెట్లో బడా కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి షేర్లే మదుపరులకు అధిక ప్రతిఫలాలు అందించాయి. దేశీయంగా ఆశాజనక ఆర్థికాంశాలతో పాటు ద్రవ్య ప్రవాహం పెరగడం ఇందుకు దోహదపడ్డాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (జూలై 16 నాటికి) బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 10,984.72 పాయింట్లు లేదా 29.81 శాతం వృద్ధి చెందగా...

ఈ ఏడాదిలో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 30% అప్‌

27 శాతం పెరిగిన స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లో బడా కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి షేర్లే మదుపరులకు అధిక ప్రతిఫలాలు అందించాయి. దేశీయంగా ఆశాజనక ఆర్థికాంశాలతో పాటు ద్రవ్య ప్రవాహం పెరగడం ఇందుకు దోహదపడ్డాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (జూలై 16 నాటికి) బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 10,984.72 పాయింట్లు లేదా 29.81 శాతం వృద్ధి చెందగా.. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 11,628.13 పాయింట్లు లేదా 27.24 శాతం పుంజుకుంది. ఇదే సమయంలో బీఎ్‌సఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ 30 మాత్రం 8,476.29 పాయింట్లు లేదా 11.73 శాతం పెరిగింది. ‘‘సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీలతో పోలిస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మెరుగైన పనితీరు కనబర్చడానికి వీటిలోకి దేశీయంగా ద్రవ్య ప్రవాహం పెరగడమే ప్రధాన కారణం. మ్యూచువల్‌ ఫండ్స్‌, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసె్‌స (పీఎంఎ్‌స)తో పాటు ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా దేశీయ మదుపరుల సొమ్ము భారీగా వీటిలోకి వచ్చి చేరుతోంద’’ని స్వస్తిక ఇన్వె్‌స్టమార్ట్‌ లిమిటెడ్‌ ఎండీ సునీల్‌ న్యాతి అన్నారు.


ప్రస్తుతం మార్కెట్లో దీర్ఘకాలిక బుల్‌ ర్యాలీ కొనసాగుతోందని, ఈ సమయంలో చిన్న, మధ్య స్థాయి కంపెనీలు బ్లూచి్‌పలకు మించిన పనితీరు కనబరుస్తుంటాయని పేర్కొన్నారు. లార్జ్‌క్యాప్‌ షేర్లూ మంచి పనితీరు కనబర్చినప్పటికీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎ్‌ఫఐఐ) అమ్మకాల కారణంగా స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యా్‌పల కంటే వెనకబడ్డాయన్నారు. మార్కెట్లో చాలావరకు కంపెనీలు, ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి విభాగ షేర్లు ఇప్పటికే అధిక ధరల వద్ద ట్రేడవుతున్నాయన్న ఆందోళనలున్నాయి. అయినప్పటికీ లార్జ్‌క్యాప్‌ షేర్లు మరింత పుంజుకునే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో భారీగా అమ్మకాలకు పాల్పడిన ఎఫ్‌ఐఐలు కూడా మళ్లీ కొనుగోళ్లు పెంచారని న్యాతి పేర్కొన్నారు.

దిద్దుబాటుకు చాన్స్‌

ఈ నెల 16న బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 80,898.3 పాయింట్ల వద్ద, మిడ్‌క్యాప్‌ సూచీ 48,175.21 పాయింట్ల వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఈ నెల 8న 54,617.75 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని రికార్డు చేసింది. దేశీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్నందున చిన్న, మధ్య స్థాయి కంపెనీలు భవిష్యత్‌లో మరింత వృద్ధి చెందడానికి అవకాశాలుండటంతో ఈ విభాగ షేర్లకు గిరాకీ పెరిగిందని మాస్టర్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అర్విందర్‌ సింగ్‌ నంద అన్నారు. సాధారణంగా మిడ్‌క్యాప్‌ సూచీలోని కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ బ్లూచి్‌పల మార్కెట్‌ క్యాప్‌లో ఐదో వంతు ఉంటుంది. పదో వంతు విలువైన కంపెనీల షేర్లు స్మాల్‌క్యాప్‌ సూచీలో ఉంటాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలో కొంత బుడగ ఏర్పడిందని, దిద్దుబాటుకు అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే, మార్కెట్లోకి ద్రవ్య ప్రవాహం నిరాటంకంగా కొనసాగుతున్న నేపథ్యంలో కరెక్షన్‌ ఎప్పుడు చోటు చేసుకోవచ్చన్నది చెప్పడం సవాలేనని అన్నారు. విధానపరమైన మార్పులు లేదా కంపెనీల పనితీరు నిరాశాజనకంగా ఉంటే తప్ప దిద్దుబాటుకు తక్షణ ప్రేరేపణలేమీ లేవన్నారు.


ఎల్‌ఐసీ, ఎస్‌బీఐకి కలిసొచ్చిన ‘ఇన్‌ఫ్రా’

గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వ రంగ దిగ్గజాలైన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ షేర్లు తమ ప్రత్యర్థి కంపెనీల కంటే మెరుగైన పనితీరు కనబర్చాయి. మౌలిక సదుపాయాలు సహా భారత భవిష్యత్‌ వృద్ధికి దోహదపడే రంగాలపై దృష్టి సారించడం ఈ రెండు కంపెనీలకు కలిసివచ్చింది. ఎల్‌ఐసీ ఇన్‌ఫ్రా సహా ఇతర వృద్ధి కారక రంగాల్లో పెట్టుబడులు పెట్టగా.. ప్రైవేట్‌ రంగానికి చెందిన హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ మాత్రం టెక్నాలజీ, కన్స్యూమర్‌, బీఎ్‌ఫఎ్‌సఐ రంగాలపై దృష్టిసారించాయి. 2023 జూలై 18న రూ.620 స్థాయిలో ఉన్న ఎల్‌ఐసీ షేరు గడిచిన ఏడాది కాలంలో 79 శాతం వృద్ధి చెంది 2024 జూలై 16న రూ.1,109.15 వద్ద ముగిసింది. కాగా, ఇదే కాలానికి హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్‌ షేరు రుణాత్మక వృద్ధిని నమోదు చేయగా.. ఐసీఐసీఐ ప్రు లైఫ్‌ 12 శాతం వృద్ధిని కనబర్చింది. ఎస్‌బీఐ లైఫ్‌ షేరు 23 శాతం పెరిగింది. ఇక ఎస్‌బీఐ విషయానికొస్తే, గడిచిన ఏడాది కాలంలో బ్యాంక్‌ షేరు రూ.592 నుంచి రూ.880.95 కు చేరుకుంది. అంటే, 48 శాతం వృద్ధిని కనబరిచింది. ఇదే సమయంలో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాం క్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు మైనస్‌ 3 శాతం నుంచి 24 శాతం శ్రేణిలో వృద్ధి చెందాయి.

Updated Date - Jul 18 , 2024 | 04:41 AM

Advertising
Advertising
<