జూన్ 6 నుంచి స్పెక్ట్రమ్ వేలం
ABN, Publish Date - May 07 , 2024 | 03:04 AM
కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పెక్ట్రమ్ వేలానికి సిద్ధమవుతోంది. జూన్ 6 నుంచి ఈ వేలం ప్రారంభం కానుంది. దాదాపు రూ.96,317 కోట్ల కనీస ధరతో ప్రభుత్వం ఈ స్పెక్ట్రమ్‌ను...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పెక్ట్రమ్ వేలానికి సిద్ధమవుతోంది. జూన్ 6 నుంచి ఈ వేలం ప్రారంభం కానుంది. దాదాపు రూ.96,317 కోట్ల కనీస ధరతో ప్రభుత్వం ఈ స్పెక్ట్రమ్‌ను వేలం వేయనుంది. ఈ వేలంలో పాల్గొనేందుకు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఇప్పటికే ఆసక్తి వ్యక్తం చేశాయి. గతంలోలా అదానీ గ్రూప్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. 800, 900, 1800, 2,100, 2,300, 2,500, 3,300 మెగాహెట్జ్ బ్యాండ్స్‌తో పాటు 26 గిగా హెట్జ్ బ్యాండ్ స్పెకా్ట్రన్ని ప్రభుత్వం వేలం వేయనుంది. ఈ వేలంలో అత్యధిక ధర చెల్లించిన కంపెనీ ఆయా స్పెక్ట్రమ్‌ను 20 ఏళ్ల పాటు వినియోగించుకోవచ్చు. ఈ చెల్లింపులను 20 వార్షిక వాయిదాల్లో చెల్లించాలి.
Updated Date - May 07 , 2024 | 03:04 AM