ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సెబీ చీఫ్‌పై సిబ్బంది గుస్సా

ABN, Publish Date - Sep 05 , 2024 | 03:00 AM

సెబీ చీఫ్‌ మాధవి పురి బుచ్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సెబీ అధికారులే ఆమెతో వేగలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తునారు. ఆమె సెబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, సంస్థలో పని ధోరణి...

వేధించుకు తింటున్నారంటూ ఆర్థిక శాఖకు లేఖ.. అంతా అబద్ధం అన్న సెబీ

న్యూఢిల్లీ: సెబీ చీఫ్‌ మాధవి పురి బుచ్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సెబీ అధికారులే ఆమెతో వేగలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తునారు. ఆమె సెబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, సంస్థలో పని ధోరణి మారిపోయిందని ఆరోపిస్తూ గత నెల ఆరో తేదీన, ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఐదు పేజీల లేఖ రాశారు. ఆచరణ సాధ్యంకాని లక్ష్యాలను నిర్దేశించడం, వాటిని సాధించలేకపోతే నలుగురి ముందు పేరుపెట్టి పరుష పదజాలంతో దూషించడం మామూలై పోయిందని అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు. ‘గ్రీవెన్సెస్‌ ఆఫ్‌ సెబీ ఆఫీసియల్స్‌-ఎ కాల్‌ ఫర్‌ రెస్పెక్ట్‌’ పేరుతో వారు ఈ లేఖ రాశారు. నలుగురిముందు పరుష పదజాలంతో బిగ్గరగా దూషించడమేగా, ప్రతి నిమిషం తమ కదలికలను గమనించడం పరిపాటైపోయిందని ఆరోపించారు. ఈ తరహా పనితీరు కారణంగా తమ మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. సెబీ చీఫ్‌ మాధవి పురి బుచ్‌ ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇపుడు సెబీ అధికారులు కూడా ఆమెపై దండెత్తడంతో ఆమె పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని భావిస్తున్నారు.


ఇది బయటి వ్యక్తుల పనే

మరోవైపు ఈ లేఖలోని ఆరోపణలను సెబీ తోసిపుచ్చింది. తమ సంస్థలో వర్కింగ్‌ కల్చర్‌ బాగానే ఉందని స్పష్టం చేసింది. గత నెల ఆరున కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు రాసిన లేఖ తమ ఉద్యోగులది కాదని తెలిపింది. బయటి వ్యక్తులే ఈ పని చేశారని ఆరోపించింది. తమ ఉద్యోగులు కూడా ఆ లేఖకు సంబంధించిన ఇ-మెయిల్‌ తాము పంపలేదని తెలిపినట్టు ప్రకటించింది. లేని సమస్యలు ఉన్నట్టు చూపిస్తూ మీడియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా సెబీ బోర్డుకి లేఖ రాయాలని బయటి వ్యక్తులు తమ జూనియర్‌ అధికారులను పురిగొల్పుతున్నట్టు ఆరోపించింది.

Updated Date - Sep 05 , 2024 | 03:00 AM

Advertising
Advertising