EPFO: ఆధార్ అలర్ట్.. మీ ఖాతాను లింక్ చేసుకోలేదా
ABN, Publish Date - May 24 , 2024 | 04:42 PM
పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ నంబర్‌ని ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. లేదంటే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేసేటప్పుడు సమస్యలు ఎదురవుతాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 సెక్షన్ 142 ప్రకారం ఉద్యోగులు, సంస్థలో పని చేస్తున్న కార్మికులు ఈపీఎఫ్ అకౌంట్‌కి ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి.
ఇంటర్నెట్ డెస్క్: పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ నంబర్‌ని ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. లేదంటే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేసేటప్పుడు సమస్యలు ఎదురవుతాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 సెక్షన్ 142 ప్రకారం ఉద్యోగులు, సంస్థలో పని చేస్తున్న కార్మికులు ఈపీఎఫ్ అకౌంట్‌కి ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి. లింక్ ప్రాసెస్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్లో చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లింక్ చేసుకునే విధానం తెలుసుకుందాం..
EPFO అధికారిక వెబ్‌సైట్ లింక్‌ని సందర్శించండి
UAN, పాస్‌వర్డ్ ఉపయోగించి మీ ఖాతాకు లాగిన్ చేయండి.
"Manage" విభాగానికి వెళ్లి, డ్రాప్‌డౌన్ మెను నుండి "KYC"ని ఎంచుకోండి.
డాక్యుమెంట్ టైప్‌గా "ఆధార్"ని ఎంచుకుని,ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
వివరాలను సమర్పించడానికి "సేవ్" బటన్‌పై క్లిక్ చేయండి.
ఆధార్ వివరాలు EPFO ద్వారా ధృవీకరిస్తారు. తద్వారా UANకి ఆటోమెటిక్‌గా లింక్ అవుతుంది.
UMANG యాప్‌తో..
ఫోన్‌లో UMANG యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
EPF ఖాతాతో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి. మీ ఖాతాకు లాగిన్ చేయడానికి MPINని కూడా ఉపయోగించవచ్చు.
UMANG యాప్‌లో లాగిన్ అయిన తర్వాత, All Services ట్యాబ్‌కు వెళ్లి, EPFO ఎంపికపై నొక్కండి
e-KYC సేవల విభాగం కింద ఆధార్ సీడింగ్ ఆప్షన్‌ను ఎంచుకోండి
UAN నంబర్‌ని నమోదు చేసి, గెట్ OTP బటన్‌ని నొక్కండి.
మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.
ఆధార్ నంబర్‌ను నమోదు చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
OTPని ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ నంబర్‌ను ధృవీకరించండి.
చివరికి ఆధార్ నంబర్ యూఎఎన్‌కి లింక్ అవుతుంది.
ఆఫ్‌లైన్‌లో..
ఆఫ్‌లైన్‌లో ఆధార్, యూఏఎన్ లింక్ చేయాలనుకుంటే ఈపీఎఫ్ఓ కార్యాలయం లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్లండి.
అక్కడ అందుబాటులో ఉన్న ఆధార్ లింకింగ్ ఫారమ్‌ను నింపండి.
ఆధార్ కార్డ్ స్వీయ ధృవీకరణతోపాటు ఆధార్ లింకింగ్ ఫారమ్‌ను సమర్పించండి.
EPFO అధికారి లేదా CSC ప్రతినిధి వివరాలను ధృవీకరిస్తారు. ఆధార్ నంబర్‌ను మీ UANకి మాన్యువల్‌గా లింక్ చేస్తారు.
లింకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్ధారణను అందుకుంటారు.
EPF, ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత EPFO వెబ్‌సైట్‌లోని మీ ప్రొఫైల్‌లో ఆధార్ ఆప్షన్ పక్కన వెరిఫైడ్ అనే పదం కనిపిస్తుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు కూడా మెసేజ్ రూపంలో నిర్ధారణ వస్తుంది.
Paytm: ఖర్చు తగ్గించుకునే పనిలో పేటీఎం.. 20 శాతం మంది ఉద్యోగులు ఔట్!
Read Latest News and National News here
Updated Date - May 24 , 2024 | 04:43 PM