ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SEBI : బ్యాచిలర్స్‌కు అచ్చిరాని మార్కెట్‌

ABN, Publish Date - Jul 27 , 2024 | 06:40 AM

పెళ్లికాని ప్రసాదులకూ స్టాక్‌ మార్కెట్‌ ఇంట్రాడే ఈక్విటీ క్యాష్‌ సెగ్మెంట్‌ పెద్దగా కలిసి రావడం లేదు. ఈ సెగ్మెంట్‌లో బ్రహ్మచారులతో పోలిస్తే.. పెళ్లయిన వారే బాగా రాణిస్తున్నారు. 2019 -2023 ఆర్థిక సంవత్సరాల మధ్య

పెళ్లయిన వారికే ఇంట్రాడే ట్రేడింగ్‌లో లాభాలు

సెబీ అధ్యయనం వెల్లడి

న్యూఢిల్లీ: పెళ్లికాని ప్రసాదులకూ స్టాక్‌ మార్కెట్‌ ఇంట్రాడే ఈక్విటీ క్యాష్‌ సెగ్మెంట్‌ పెద్దగా కలిసి రావడం లేదు. ఈ సెగ్మెంట్‌లో బ్రహ్మచారులతో పోలిస్తే.. పెళ్లయిన వారే బాగా రాణిస్తున్నారు. 2019 -2023 ఆర్థిక సంవత్సరాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కె ట్లో మదుపరుల తీరుతెన్నులపై మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇంట్రాడే ఈక్విటీ క్యాష్‌ సెగ్మెంట్‌లో ట్రేడింగ్‌ చేసిన బ్రహ్మచారుల్లో 75 శాతం మంది నష్టపోతే.. నష్టపోయిన పెళ్లయిన వారి శాతం 67 శాతం మాత్రమేనని సెబీ వెల్లడించింది. దీనికి తోడు బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లయిన వారే ఎక్కువగా ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్‌ చేస్తున్నట్టు వెల్లడైంది.

మహిళలకే అధిక లాభాలు: సెబీ అధ్యయనంలో మరో ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. క్యాష్‌ సెగ్మెంట్‌లో ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్‌ చేసే మహిళలతో పోలిస్తే.. పురుషులే ఎక్కువగా నష్టపోతున్నట్టు వెల్లడైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి అంత కంటే ఎక్కువ మొత్తానికి ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్‌ చేసిన పురుషులు సగటున రూ.38,570 నష్టపోయారు. ఇదే సవయంలో మహిళల విషయానికి వచ్చే సరికి ఇది రూ.22,153 మాత్రమేనని సెబీ అధ్యయనం పేర్కొంది. ఇదే కాలంలో ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్‌ చేసే మహిళల శాతం 20 నుంచి 16 శాతానికి పడిపోవడం మరో విశేషం.

ఎక్కువ నష్టపోతోందీ కుర్రాళ్లే..: ఇంట్రాడే ఈక్విటీ క్యాష్‌ సెగ్మెంట్‌లో పెద్ద వాళ్లతో పోలిస్తే కుర్రాళ్లు ఎక్కువగా నష్టపోతున్నట్టు సెబీ అధ్యయనం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ట్రేడింగ్‌ తీరుతెన్నులను పరిశీలిస్తే 60 ఏళ్లకు పైబడిన ఇంట్రాడే ఈక్విటీ ట్రేడర్లలో 53 శాతం మంది నష్టపోయారు. రెండు పదుల కంటే తక్కువ వయసు ఉన్న వారికి వస్తే, వీరిలో 81 శాతం మంది ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్‌లో నష్టపోయారు.

Updated Date - Jul 27 , 2024 | 06:40 AM

Advertising
Advertising
<