ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Stock Market Updates: రెండు రోజుల నష్టాల తర్వాత లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు..ఇవే ట్రెండింగ్ స్టాక్స్

ABN, Publish Date - Jan 04 , 2024 | 10:42 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సహా బ్యాంక్ నిఫ్టీ సూచీలు కూడా గరిష్ట సూచీల దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్న స్టాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం గత రెండు రోజుల నష్టాల తర్వాత లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీలు గ్రీన్‌లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉదయం 10.26 గంటలకు సెన్సెక్స్ 426 పాయింట్లు పెరిగి 71,700 దాటింది. ఇక నిఫ్టీ కూడా 117 పాయింట్ల లాభంతో 21,600 స్థాయి వద్ద ఉంది. మార్కెట్లో మెటల్, ఆటో రంగాల్లో గరిష్ట కొనుగోళ్లు నమోదవుతున్నాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ సూచీ కూడా 273 పాయింట్లు పెరిగి 47,970 పరిధిలో ట్రేడ్ అవుతుండగా..నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 492 పాయింట్లు ఎగబాకి 47024 దాటింది. అంతకుముందు బుధవారం సెన్సెక్స్ 535 పాయింట్లు ఎగబాకి 71,356 వద్ద ముగిసింది.


ఈ నేపథ్యంలో ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్, NTPC, టాటా కన్‍‌స్ట్రక్షన్, బజాజ్ ఫిన్‌సర్వ్, ONGC షేర్లు టాప్ 5 గెయినర్లుగా ఉన్నాయి. కాగా బీపీసీఎల్‌, బజాజ్ ఆటో, ఎల్టీఐ మైండ్ ట్రీ, మారుతీ సుజుకీ, టాటా స్టీల్ స్టాక్స్ టాప్‌ 5 లూజర్‌గా నిలిచాయి. అయితే భారతీయ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు, దేశీయ ఫండ్‌లు క్రమంగా పెరగడం సహా అమెరికన్ మార్కెట్ దిద్దుబాటు చర్యలు సహా పలు అంశాలు మార్కెట్ల పాజిటివ్ దోరణికి సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ప్రైవేట్ సర్కిల్ ద్వారా సేకరించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం FY22కి రూ.1,678.15 కోట్లతో పోలిస్తే FY23లో నష్టాలు రూ.1,678 కోట్లకు తగ్గాయని తెలుస్తోంది. ఈ క్రమంలో FY22లో ఆదాయం 26 శాతం పెరిగి రూ.719 కోట్ల నుంచి రూ.907 కోట్లకు చేరుకుందని టెస్ట్ ప్రిపరేషన్ స్టార్టప్ అనాకాడెమీ వెల్లడించింది.

Updated Date - Jan 04 , 2024 | 10:42 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising