ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ సూచీలు..!

ABN, Publish Date - Aug 27 , 2024 | 04:07 PM

వరుస లాభాలతో దూసుకుపోతున్న దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే జోష్‌తో ప్రారంభమయ్యాయి. ఉదయం అంతా లాభాల్లోనే కదలాడాయి. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు అమ్మకాలకు దిగడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఒక దశలో సూచీలు నష్టాల్లోకి కూడా జారుకున్నాయి.

Stock Market

వరుస లాభాలతో దూసుకుపోతున్న దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే జోష్‌తో ప్రారంభమయ్యాయి. ఉదయం అంతా లాభాల్లోనే కదలాడాయి. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు అమ్మకాలకు దిగడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఒక దశలో సూచీలు నష్టాల్లోకి కూడా జారుకున్నాయి. అయితే చివర్లో కొనుగోళ్ల మద్దతు దొరకడంతో స్వల్ప లాభాలతో రోజును ముగించాయి. సెన్సెక్స్ కేవలం 13 పాయింట్ల స్వల్ప లాభంతో రోజును ముగించింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే పయనించింది. (Business News).


సోమవారం ముగింపు (81, 698)తో పోల్చుకుంటే దాదాపు 115 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో దాదాపు 200 పాయింట్లకు పైగా లాభపడి 81,919 వద్ద ఇంట్రాడే హైని టచ్ చేసింది. 82 వేల మార్క్‌ను కూడా చేరుకునేలా కనిపించింది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలవడంతో అక్కడి నుంచి దాదాపు 300 పాయింట్లు కోల్పోయి నష్టాల్లోకి జారిపోయింది. 81,600 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. సెన్సెక్స్ చివరకు 13 పాయింట్ల నష్టంతో 81, 711 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. కేవలం 7 పాయింట్ల లాభంతో 25,017 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో ఆర్‌ఈసీ, పవర్ ఫైనాన్స్, ఐఈఎక్స్, చోళ ఇన్వెస్ట్‌మెంట్స్ లాభాలు ఆర్జించాయి. కమిన్స్, టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సింజిన్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 289 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్లు ఎగబాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.92గా ఉంది.

ఇవి కూడా చదవండి..

YouTube: యూజర్లకు షాకిచ్చిన యూట్యూబ్.. ఈ ప్లాన్‌ల ధరలు పెంపు


Business Idea: రూ. 15 వేల పెట్టుబడితో వ్యాపారం .. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం


Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 27 , 2024 | 04:07 PM

Advertising
Advertising
<