సెన్సెక్స్ 760 పాయింట్లు అప్
ABN, Publish Date - Nov 30 , 2024 | 05:46 AM
ప్రధాన కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌ను శుక్రవా రం పరుగులు తీయించాయి. సెన్సెక్స్ 759 పాయింట్ల లాభంతో 79,802 వద్ద ముగియగా నిఫ్టీ 216.95 పాయింట్ల లాభంతో 24,131,10 వద్ద ముగిసింది.
ముంబై: ప్రధాన కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌ను శుక్రవా రం పరుగులు తీయించాయి. సెన్సెక్స్ 759 పాయింట్ల లాభంతో 79,802 వద్ద ముగియగా నిఫ్టీ 216.95 పాయింట్ల లాభంతో 24,131,10 వద్ద ముగిసింది. వారం మొత్తంలో సెన్సెక్స్ 685.68 పాయింట్లు, నిఫ్టీ 223.85 పాయింట్లు లాభపడ్డాయి. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్-100 సూచీ 0.31 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.76 శాతం లాభంతో ముగిశాయి.
లాభాల్లో అదానీ షేర్లు: అదానీ గ్రూప్‌లోని 11 కంపెనీల్లో 9 కంపెనీల షేర్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ అత్యధికంగా 22 శాతం లాభపడగా అదానీ ఎనర్జీ (16ు), అంబుజా సిమెంట్స్ (3.73ు) అదానీ పోర్ట్స్ (1.94ు), ఏసీ సీ (1.59ు), అదానీ టోటల్ గ్యాస్ (1.03ు), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (1.02ు), ఎన్‌డీటీవీ (0.60 శాతం, అదానీ విల్మర్ (0.05 శాతం) లాభపడ్డాయి.
ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజనీర్స్ లిస్టింగ్ అదిరింది.
ఎ్‌సఈలో ఈ షేరు ఇష్యూ ధర రూ.148 కన్నా 47.29 ు ప్రీమియంతో రూ.218 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 57.77ు లాభపడి రూ.233.50 వరకు వెళ్లిన ఈ షేరు చివరికి 39.86ు లాభంతో రూ.207 వద్ద ముగిసిం ది. ఎన్‌ఎ్‌సఈలో కూడా 39.97 శాతం లాభంతో రూ.207.16 వద్ద ముగిసింది.
ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములు రూ.700 పెరిగి రూ,79,400 పలుకగా కిలో వెండి ధర రూ.1300 పెరిగి రూ.92,200కి చేరింది.
Updated Date - Nov 30 , 2024 | 05:49 AM