TATA: గుడ్ న్యూస్ చెప్పిన టాటా సంస్థ! ఐఫోన్ కంపెనీలో జాబ్ కావాలా? అయితే..
ABN, Publish Date - Sep 28 , 2024 | 06:52 PM
టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు రెడీ అవుతోంది. హోసూర్‌లోని సంస్థకు చెందిన ఐఫోన్ అసెంబ్లీ యూనిట్‌లో 20 వేల మందికి పైగా కొత్త ఉద్యోగులను త్వరలో నియమించుకుంటామని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తాజాగా పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు రెడీ అవుతోంది. హోసూర్‌లోని సంస్థకు చెందిన ఐఫోన్ అసెంబ్లీ యూనిట్‌లో 20 వేల మందికి పైగా కొత్త ఉద్యోగులను త్వరలో నియమించుకుంటామని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తాజాగా పేర్కొన్నారు. పాణిపాక్కంలో టాటామోటార్స్, జేఎల్ఆర్ సంయుక్తంగా ఏర్పాటు చేయబోతున్న తయారీ యూనిట్ శంకుస్థాపనకు ఆయన హాజరయ్యారు. మొత్తం 9 వేల కోట్లతో ఈ యూనిట్‌లో ఏర్పాటు చేస్తున్నారు.
భారత మార్కెట్లోకి రోల్స్ రాయిస్ కలినాన్ సిరీస్-2
ఈ సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ హోసూర్‌లో ఇది వరకే అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ‘‘ప్రస్తుతం 20 వేల మంది అక్కడ పనిచేస్తున్నారు. అందులో 15 వేల మంది మహిళలే. మరో ఏడాదిలో అక్కడి ఉద్యోగుల సంఖ్య 40 వేలకు చేరుకుంటుంది. ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అవుతుంది. కంపెనీలో మొత్తం1.50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ చుట్టూ అల్లుకున్న వ్యవస్థ ఆధారంగా మరి కొన్ని లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు’’ అని ఆయన చెప్పారు (Tata Electronics to hire 20K more employees at Hosur unit)
మ్యూచువల్ ఫండ్ల రిస్క్‌కు కలర్ కోడింగ్!
ప్రస్తుతం నిర్మింప తలపెట్టిన ఫ్యాక్టరీ సామాన్యమైనదని కాదని చంద్రశేఖరన్ అన్నారు. అత్యాధునిక సాంకేతికతో ఏర్పాటు చేయిబోతున్న ఈ ఫ్యాక్టరీలో హై ఎండ్ వాహనాలను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ఈ ప్లాంట్‌లో కార్యకలాపాలు మొదలయ్యాక 5 వేల మందికి ప్రత్యక్షంగా, మరింత మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అన్నారు.
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ లావాదేవీ రుసుము సవరణ
గత మూడేళ్లుగా టాటా గ్రూప్ తమిళనాడులో భారీగా పెట్టుబడులు పెడుతోంది. టాటా పవర్, టాటా ఎలక్ట్రానిక్స్, టాటా మోటార్స్‌కు చెందిన తాయారీ యూనిట్లలోకి నిధులు మళ్లించింది. అంతేకాకుండా, స్థానిక యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ యూనిట్లలోనూ పెట్టుబడులు పెట్టింది.
Updated Date - Sep 28 , 2024 | 07:00 PM