ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్‌కు కొన్ని రోజులే గడువు.. మరి ఈ విషయం తెలుసా లేదా?

ABN, Publish Date - Jun 18 , 2024 | 01:55 PM

ఫామ్-16 లేనప్పుడు ఐటీఆర్‌ దాఖలు చేయడం సాధ్యమేనా? ఎలా దాఖలు చేస్తారు? అనే సందేహాలతో తెగ కంగారు పడుతుంటారు. అయితే ఏమాత్రం ఆందోళన అక్కర్లేదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఫామ్-16 లేకపోయినా ఉద్యోగులు ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఒక ప్రత్యమ్నాయ మార్గం ఉందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రత్యామ్నాయ విధానానికి సంబంధించిన వివరాలను మీరూ తెలుసుకోవచ్చు.

మదింపు ఏడాది 2024-25కు (ఆర్థిక సంవత్సరం 2024) సంబంధించిన ఐటీఆర్ దాఖలు గడువు జులై 31, 2024తో ముగియనుంది. మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలివుండడంతో చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైలింగ్‌కు త్వరపడుతున్నారు. కాగా ఐటీఆర్ దాఖలు ప్రక్రియలో చాలా ముఖ్యమైన ఫామ్-16 అందని చెల్లింపుదారులు ఆందోళన చెందడం చాలా సహజమైనది. ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం టీడీఎస్‌‌కు (పన్ను మినహాయింపు) లోబడి ఆదాయం పొందుతున్న ఉద్యోగులకు ఈ ఫామ్ కీలకమైనది. అంతటి ముఖ్యమైన ఈ ఫామ్‌ను యాజమాన్య కంపెనీలే స్వయంగా ఉద్యోగులకు అందజేస్తుంటాయి. మరి ఫామ్-16 కంపెనీల నుంచి అందనప్పుడు ఐటీఆర్‌ దాఖలు సాధ్యమేనా? ఎలా దాఖలు చేస్తారు? అనే సందేహాలతో తెగ కంగారు పడుతుంటారు. అయితే ఏమాత్రం ఆందోళన అక్కర్లేదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఫామ్-16 లేకపోయినా ఉద్యోగులు ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఒక ప్రత్యమ్నాయ మార్గం ఉందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రత్యామ్నాయ విధానానికి సంబంధించిన వివరాలను మీరూ తెలుసుకోవచ్చు.


ఫామ్-6 లేకుండా ఐటీఆర్ ఫైలింగ్ సాధ్యమే

ఫామ్-16 లేకపోయినప్పటికీ చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైలింగ్ చేయవచ్చు. ఈ ప్రక్రియ కాస్త కష్టంగానే అనిపించినా ఐటీఆర్ దాఖలు చేయవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఫామ్-16పై ఉద్యోగి తన జీతం, మినహాయించిన పన్నుల లెక్కలను చూపిస్తాడు. కాబట్టి ఉద్యోగి ఈ వివరాలను సేకరించి.. ఆ సమాచారానంతా నిర్ధారించుకోవడం ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఉద్యోగి శాలరీ స్లిప్‌లు, ఫారం 26ఏఎస్ (టీడీఎస్ సర్టిఫికేట్), ఏఐఎస్ (యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్), టీఐసీఎస్ (ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ), పెట్టుబడులకు సంబంధించిన స్లిప్‌లను ఉపయోగించి ఐటీఆర్ దాఖలు చేయవచ్చునని ‘ఆల్ ఇండియా ఐటీఆర్’ డైరెక్టర్ వికాస్ దహియా సూచించారు. ఒక వ్యక్తి నిర్దేశిత ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం, చెల్లించిన పన్నుల సమగ్ర వివరాలను ఐటీఆర్ దాఖలు (ITR Filing) ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాడని వివరించారు.


ఎలా దాఖలు చేయాలి?

పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ నుంచి ఫారం 26ఏఎస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ ఫామ్ సమగ్ర పన్ను స్టేట్‌మెంట్‌ కోసం ఉద్దేశించినది. పాన్‌కార్డు ఆధారంగా ఈ ఫామ్‌లో చెల్లింపుదారుడి టీడీఎస్, అకౌంట్‌లో క్రెడిట్ అయిన మొత్తం అన్ని వివరాలు ఉంటాయి. శాలరీ స్లిప్పులతో సరిపోల్చుకొని టీడీఎస్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని వికాస్ దహియా సూచించారు. ఆ ఆదాయానికి సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించాలని పేర్కొన్నారు. శాలరీ పే స్లిప్‌లు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను నిశితంగా పరిశీలించుకున్న తర్వాత పూర్తి రిపోర్టుని నిర్ధారించుకోవాలని, అదనపు ఆదాయ వనరుల వివరాలు తెలుసుకునేందుకు టీఐఎస్‌ను (ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ) పరిశీలించుకోవాలి.


మినహాయింపుల గరిష్ఠ ప్రయోజనాలు పొందండి

ఐటీఆర్ ఫైలింగ్‌కు ముందు చెల్లింపుదారుడు పన్ను సంబంధించి అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ధారించుకోవాలి. టీడీఎస్‌ను నిర్ధారించుకోవాలి. ఇందుకు ఆదాయపు పన్ను పోర్టల్‌ నుంచి ఫామ్ 26ఏఎస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని పరిశీలించుకోవడం ఉత్తమమని రవి రాజన్ అండ్ కో వ్యవస్థాపకుడు ఎస్ రవి సూచించారు. పన్ను మినహాయింపు అవకాశాలను గరిష్ఠంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాలి. ఎల్‌ఐసీ ప్రీమియంలు, ట్యూషన్ ఫీజులు, హౌసింగ్ లోన్లపై రీపేమెంట్స్, హౌసింగ్ లోన్‌లపై చెల్లించే వడ్డీ, ఇంటి అద్దె అలవెన్స్ (HRA), పీఎఫ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ వంటి అర్హత కలిగిన వ్యయాలన్నింటి విషయంలో మినహాయింపులు పొందే మార్గాలను అన్వేషించాలని రవి సూచించారు.


పన్ను లెక్క పక్కా ఉండాలి..

ఐటీఆర్ దాఖలకు ముందు చెల్లింపుదారుడు చెల్లించాల్సిన పన్నును చాలా జాగ్రత్తగా లెక్కించాలి. మినహాయింపులకు సంబంధించిన అన్ని క్లెయిమ్‌లు చేసుకున్న తర్వాత ఆదాయంపై చెల్లించాల్సిన నికర పన్నును నిర్ధారించుకోవాలి. మినహాయింపు పోను అదనపు పన్నులు చెల్లించాల్సి ఉన్నారా లేదా మీకే రిఫండ్ వస్తుందా అనే వివరాలను తెలియజేసేందుకు బ్రాకెట్‌ను ఉపయోగించాలి.


ఆన్‌లైన్‌లో చాలా స్పీడ్‌గా..

ఆన్‌లైన్ ప్రక్రియలో ఐటీఆర్ ఫైలింగ్ చేయడం ఉత్తమం. ఎందుకంటే ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుంది. ఫలితంగా వెయిటింగ్ సమయం తగ్గుతుంది. ఐటీఆర్ ఫైలింగ్ స్టేటస్‌ని ఆధార్ ఐ-వెరిఫికేషన్ ద్వారా ధృవీకరించుకోవచ్చనని నిపుణులు సూచించారు.

Updated Date - Jun 18 , 2024 | 01:55 PM

Advertising
Advertising