ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టెక్‌ వ్యూ : 26,000 స్థాయి కీలకం

ABN, Publish Date - Sep 30 , 2024 | 01:43 AM

నిఫ్టీ గత వారం మరింత ర్యాలీలో పురోగమిస్తూ 26,250 వరకు వెళ్లింది. శుక్రవారంనాడు మైనర్‌ కరెక్షన్‌ సాధించినా చివరికి ముందు వారంతో పోల్చితే 390 పాయింట్ల లాభంతో 26,180 వద్ద ముగిసింది. మొత్తం మీద గత మూడు వారాల్లో...

టెక్‌ వ్యూ : 26,000 స్థాయి కీలకం

నిఫ్టీ గత వారం మరింత ర్యాలీలో పురోగమిస్తూ 26,250 వరకు వెళ్లింది. శుక్రవారంనాడు మైనర్‌ కరెక్షన్‌ సాధించినా చివరికి ముందు వారంతో పోల్చితే 390 పాయింట్ల లాభంతో 26,180 వద్ద ముగిసింది. మొత్తం మీద గత మూడు వారాల్లో నిఫ్టీ ఎలాంటి కరెక్షన్‌ లేదా కన్సాలిడేషన్‌ లేకుండానే 1,500 పాయింట్ల మేరకు లాభపడింది. గత నాలుగు నెలలుగా మార్కెట్లో ఏర్పడిన రికార్డు ర్యాలీలో నిఫ్టీ 4,900 పాయింట్లు లాభపడింది. అమెరికన్‌ మార్కెట్లో గత వారం రికార్డు గరిష్ఠ స్థాయి ల్లో రియాక్షన్‌ ఏర్పడిన కారణంగా నిఫ్టీ ఈ వారంలో అప్రమత్త ట్రెండ్‌లో ట్రేడ్‌ కావచ్చు. అలాగే ప్రధాన మానసిక అవధి 26,000 స్థాయిని బ్రేక్‌ చేసినందు వల్ల టెక్నికల్‌ పుల్‌బ్యాక్‌ అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ 26,000 కీలకంగా మారింది.


మిడ్‌క్యాప్‌-100 ఇండెక్స్‌ చివరి మూడు సెషన్లలో కరెక్షన్‌లో పడి 170 పాయింట్ల స్వల్ప లాభానికే సరిపెట్టుకుంది. అయితే స్మాల్‌క్యాప్‌-100 ఇండెక్స్‌ మాత్రం 90 పాయింట్ల స్వల్ప నష్టంతో ముగిసింది. గత ఐదు వారాలుగా స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ కన్సాలిడేషన్‌ ధోరణిలో కదలాడుతోంది.

బుల్లిష్‌ స్థాయిలు: పాజిటివ్‌ ధోరణిలో ట్రేడయితే ఎగువన నిరోధ స్థాయి 26,300. ఇది గత శుక్రవారం ఏర్పడిన జీవితకాల గరిష్ఠ స్థాయి. ఆ పైన నిలదొక్కుకుంటే సరికొత్త గరిష్ఠ స్థాయిల దిశగా పురోగమిస్తుంది. ప్రధాన నిరోధ స్థాయిలు 26,600, 27,000.

బేరిష్‌ స్థాయిలు: మానసిక అవధి 26,000ని మార్కెట్‌ బ్రేక్‌ చేసినందు వల్ల అది మద్దతు స్థాయిగా మారింది. భద్రత కోసం నిఫ్టీ ఇక్కడ నిలదొక్కుకుని, కన్సాలిడేట్‌ కావాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనత ముప్పు ఏర్పడుతుంది.


బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 40 పాయింట్ల నామమాత్రపు లాభంతో 53,830 వద్ద ముగిసింది. గత వారంలో 54,500 వరకు వెళ్లినా రియాక్షన్‌లో పడి 550 పాయింట్ల మేరకు నష్టపోవడం ఇందుకు కారణం. మరింత సానుకూలత కోసం మైనర్‌ నిరోధ స్థాయి 54,100 కన్నా పైన నిలదొక్కుకోవాలి. బలహీనపడితే 53,500 వద్ద పరీక్ష ఎదుర్కొంటుంది. ఇక్కడ విఫలమైతే మైనర్‌ బలహీనత ఏర్పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 53,000.

పాటర్న్‌: గతంలో ఏర్పడిన బాటమ్‌ 26,000 వద్ద బ్రేక్‌డౌన్‌ సాధిస్తే మరింత దిగజారవచ్చు. ఆర్‌ఎ్‌సఐ సూచీల ప్రకారం మార్కెట్‌ ఇప్పటికీ ఓవర్‌బాట్‌ స్థితిలో ఉంది. గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలి. కన్సాలిడేషన్‌ లేదా కరెక్షన్‌ తప్పనిసరి. ప్రస్తుతానికి మార్కెట్‌ స్వల్పకాలిక సూచీల కన్నా చాలా పైనే ఉంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 26,200, 26,270

మద్దతు : 26,060, 26,000

వి. సుందర్‌ రాజా

Updated Date - Sep 30 , 2024 | 01:43 AM