టెక్ వ్యూ : నిరోధ స్థాయి 25000
ABN, Publish Date - Dec 16 , 2024 | 05:18 AM
నిఫ్టీ గత వారం తొలి నాలుగు రోజుల్లో 24,500 స్థాయిలో బలమైన కన్సాలిడేషన్ సాధించింది. శుక్రవారం ఒక దశలో 350 పాయింట్ల మేరకు ఇంట్రాడే రియాక్షన్ సాధించినా బలంగా కోలుకుని వారం మొత్తానికి 90 పాయింట్ల లాభంతో...
టెక్ వ్యూ : నిరోధ స్థాయి 25000
నిఫ్టీ గత వారం తొలి నాలుగు రోజుల్లో 24,500 స్థాయిలో బలమైన కన్సాలిడేషన్ సాధించింది. శుక్రవారం ఒక దశలో 350 పాయింట్ల మేరకు ఇంట్రాడే రియాక్షన్ సాధించినా బలంగా కోలుకుని వారం మొత్తానికి 90 పాయింట్ల లాభంతో 24,770 వద్ద ముగిసింది. పుల్‌బ్యాక్ రియాక్షన్ అనంతరం మద్దతు స్థాయిలకు పైనే బలమైన రికవరీ సాధించి ట్రెండ్ పటిష్ఠం గా నిలబెట్టుకుంది. వరుసగా నాలుగు వారాలుగా అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ 1500 పాయింట్ల మేరకు రిలీఫ్ ర్యాలీ సాధించింది. గత వారం మిడ్‌క్యాప్-100 సూచీ 290 పాయింట్ల మేరకు లాభపడి 59,000 సమీపంలో ఉంది. అయితే స్మాల్‌క్యాప్-100 సూచీ మాత్రం 85 పాయింట్ల మేరకు నష్టపోయింది. టెక్నికల్‌గా ప్రస్తుతానికి ట్రెండ్ సానుకూలంగానే ఉంది. అయితే శుక్రవారం అమెరికన్ మార్కెట్లో ఏర్పడిన బలహీనత కారణంగా ఈ వారం మరింత అప్రమత్త ట్రెండ్ సాధించవచ్చు. అలాగే నిఫ్టీ మానసిక అవధి 25,000 చేరువకు వస్తోంది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ పాజిటివ్ ట్రెండ్‌లో ట్రేడయినట్టయితే మరింత అప్‌ట్రెండ్ కోసం తదుపరి నిరోధం 24,850 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన స్వల్పకాలిక నిరోధం 25,000. సానుకూలత కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి.
బేరిష్ స్థాయిలు: సూచీకి మైనర్ మద్దతు స్థాయి 24,650. ప్రధాన మద్దతు స్థాయి 24,500. బలహీనత ప్రదర్శించినా భద్రత కోసం ఈ స్థాయిల్లో నిలదొక్కుకుని తీరాలి. 24,500 వద్ద విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత శుక్రవార 1500 పాయింట్ల మేరకు రికవరీ సాధించి 53,850 వద్ద నిలకడగా ముగిసింది. జీవితకాల గరిష్ఠ స్థాయి 54,000కి చేరువవుతోంది. ప్రధాన నిరోధం 54,100. మరింత సానుకూలత కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 54,500. బలహీనత ప్రదర్శించినా సానుకూలతను కొనసాగించేందుకు మద్దతు స్థాయి 53,000 వద్ద నిలదొక్కుకోవాలి.
పాటర్న్: గత వారం నిఫ్టీ 50, 100 డిఎంఏల వద్ద రికవరీ సాధించింది. 25000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన ట్రెండ్‌లైన్’’ వద్ద ప్రధాన నిరోధం ఉంది. మరింత అప్‌ట్రెండ్ కోసం ఈ నిరోధాన్ని ఛేదించాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 24,850, 24,940
మద్దతు : 24,680, 24,600
వి. సుందర్ రాజా
Updated Date - Dec 16 , 2024 | 05:18 AM