టెక్ వ్యూ : 24,000 వద్ద గట్టి పరీక్ష
ABN, Publish Date - Nov 11 , 2024 | 02:45 AM
నిఫ్టీ గత వారం ఆరంభంలోనే 500 పాయింట్లు పతనమై బేరిష్ ట్రెండ్‌ను కనబరిచింది. అయితే కీలకమైన 24,000 స్థాయిల వద్ద రికవరీ సాధించి 24,500 స్థాయికి చేరుకున్నప్పటికీ అక్కడ నిలదొక్కుకోవటంలో విఫలమైంది. అంతేకాకుండా...
టెక్ వ్యూ : 24,000 వద్ద గట్టి పరీక్ష
నిఫ్టీ గత వారం ఆరంభంలోనే 500 పాయింట్లు పతనమై బేరిష్ ట్రెండ్‌ను కనబరిచింది. అయితే కీలకమైన 24,000 స్థాయిల వద్ద రికవరీ సాధించి 24,500 స్థాయికి చేరుకున్నప్పటికీ అక్కడ నిలదొక్కుకోవటంలో విఫలమైంది. అంతేకాకుండా ఎలాంటి సానుకూల ట్రెండ్‌ను సూచించలేదు. చివరకు వారాంతంలో 155 పాయింట్ల నష్టంతో 24,150 పాయింట్ల వద్ద క్లోజైంది. 24,000 స్థాయిల వద్ద మద్దతు తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. టెక్నికల్‌గా చూస్తే మొత్తం ట్రెండ్ బలహీనంగా కనిపిస్తోంది. వారం ప్రాతిపదికన చూస్తే గత వారం మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 150 పాయింట్లు, స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 250 మేర పాయింట్ల మేరకు నష్టపోయాయి. గత వారం మార్కెట్ గమనం ప్రకారం చూస్తే ఈ వారం నిఫ్టీ మరోసారి నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోసారి 24,000 స్థాయిల వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొనే వీలుంది. ప్రధాన బాటమ్ స్థాయిలైన 24,000 ఎగువన నిలదొక్కుకుంటేనే సానుకూల ట్రెండ్‌ను కనబరిచే అవకాశం ఉంది.
బుల్లిష్ స్థాయిలు: పాజిటివ్ ట్రెండ్ కోసం మైనర్ నిరోధ స్థాయిలైన 24,300 ఎగువన నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 24,500. ఇది రెండు వారాల క్రితం ఏర్పడిన గరిష్ట స్థాయి. ఇక్కడ నిలదొక్కుకుంటేనే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది.
బేరిష్ స్థాయిలు: ప్రధాన మద్దతు స్థాయిలైన 24,000 వద్ద నిలదొక్కుకోవటంలో విఫలమైతే మరింత బలహీనతను సూచిస్తుంది. సానుకూల, రక్షణ కోసం కీలకమైన ఈ మద్దతు స్థాయిలకు ఎగువన కచ్చితంగా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. బలహీతను సూచిస్తే మాత్రం స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటం మంచిది. తదుపరి మద్దతు స్థాయిలు 23,800, 23,500.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ కూడా గత వారం సైడ్‌వేస్ ట్రెండ్‌ను కొనసాగించింది. కొద్ది వారాలుగా ఈ సూచీ 52,000 స్థాయిల్లో కదలాడుతోంది. వీక్లీ ప్రాతిపదికన చూస్తే గత వారం ఈ సూచీ 110 పాయింట్ల నష్టంతో 51,560 స్థాయిల వద్ద క్లోజైంది. సానుకూల ట్రెండ్ కోసం ప్రధాన నిరోధ స్థాయిలైన 52,000 ఎగువన నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 52,600. ఒకవేళ బలహీనతను సూచిస్తే మాత్రం 51,000 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ కూడా నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 50,400.
పాటర్న్: నిఫ్టీకి 24,000 స్థాయిల వద్ద సమాంతరంగా దిగువకు ఏర్పడిన ట్రెండ్‌లైన్ దగ్గర మద్దతు స్థాయిలున్నాయి. ఒకవేళ ఈ మద్దతు స్థాయి కంటే దిగువకు చేరితే స్వల్పకాలిక బలహీనతను కనబరుస్తుంది. నిఫ్టీ ప్రస్తుతం 24,500 వద్ద అడ్డంగా కిందకు ఏర్పడిన నిరోధ రేఖకు దిగువన ఉంది. సానుకూలత కోసం ఈ రేఖకు ఎగువన బ్రేకౌట్ సాధించాల్సి ఉంటుంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం సోమవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 24,110, 24,200
మద్దతు : 24,000, 23,920
వి. సుందర్ రాజా
Updated Date - Nov 11 , 2024 | 02:45 AM