సెబీ ఈడీగా తెలుగు వ్యక్తి జీఆర్‌ఎం రావు
ABN , Publish Date - Jan 05 , 2024 | 06:28 AM
మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా గోవిందాయపల్లి రామ్మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఆయనను మూడు సంవత్సరాల కాలానికి ఈడీగా సెబీ నియమించింది...

న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా గోవిందాయపల్లి రామ్మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఆయనను మూడు సంవత్సరాల కాలానికి ఈడీగా సెబీ నియమించింది. ఆయన అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్ (ఏసీఎ్‌ఫఈ) నుంచి సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్ సర్టిఫికెట్ కలిగి ఉన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్, ఎంబీఎ డిగ్రీ పట్టాను అందుకున్న రామ్మోహన్ రావు.. ముంబై విశ్వవిద్యాలయంలో లా డిగ్రీని కూడా పూర్తి చేశారు. కాగా ఈడీ హోదాలో సెబీలో దర్యాప్తు, అంతర్గత తనిఖీ విభాగాలను ఆయన పర్యవేక్షిస్తారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులు కావడానికి ముందు ఆయన సెబీ ఈస్టర్న్ రీజినల్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ హోదాలో ఆయన తనిఖీలు, ఇన్వెస్టర్ సర్వీస్ కేంద్రాల ఏర్పాటు, ఇన్వెస్టర్ చైతన్యం, ఫిర్యాదుల పరిష్కారం వంటి విభిన్న శాఖలను నిర్వహించారు.