ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భవిష్యత్‌ అంతా ఫార్మా సేవల రంగానిదే

ABN, Publish Date - Jun 22 , 2024 | 04:09 AM

ఐటీ సర్వీసుల రంగం తరహాలోనే రానున్న రోజుల్లో ఫార్మా సేవల రంగానికి అమితమైన గిరాకీ ఏర్పడనుందని ఈ రంగంలోని కంపెనీలంటున్నాయి.

ఇందుకు ప్రత్యేక పారిశ్రామిక పార్క్‌ అవసరం

పార్క్‌ ఏర్పాటుతో మరిన్ని అవకాశాలు

తెలంగాణ ప్రభుత్వానికి ఫార్మా సర్వీసెస్‌ సంస్థల వినతి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఐటీ సర్వీసుల రంగం తరహాలోనే రానున్న రోజుల్లో ఫార్మా సేవల రంగానికి అమితమైన గిరాకీ ఏర్పడనుందని ఈ రంగంలోని కంపెనీలంటున్నాయి. శుక్రవారం నాడిక్కడ భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ చాప్టర్‌ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఫార్మా సంస్థలకు చెందిన సీఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ సీఈఓ మణి కంటిపూడి మాట్లాడుతూ.. కాంట్రాక్ట్‌ పద్ధతిలో వినూత్న ఔషధాల మాలిక్యూల్స్‌ కోసం పరిశోధన, అభివృద్ధితో పాటు వాటిని ఉత్పత్తి చేసే (సీఆర్‌ఓ-సీడీఎంఓ) ఫార్మా సేవల కంపెనీలకు మంచి భవిష్యత్‌ ఉందన్నారు. అయితే ఇందుకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా తోడైతే ఈ రంగం ఐటీ సేవల రంగం తరహాలోనే శరవేగంగా వృద్ధి చెంది పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలతో పాటు ఎగుమతి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు ఈ సేవల కోసం చైనాపై ఆధారపడిన అమెరికా, యూరప్‌ దేశాలకు చెందిన పలు ఫార్మా కంపెనీలు.. చైనా ప్లస్‌ వన్‌ వ్యూహాంలో భాగంగా ఫార్మా సేవల కోసం భారత్‌ వైపు చూస్తున్నాయని మణి పేర్కొన్నారు. అయితే ఈ అవకాశాలను దక్కించుకునేందుకు గాను ఫార్మా సేవల రంగానికి చెందిన కంపెనీల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కు లేదా క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ఈ రంగంలోని కంపెనీలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాయని ఆయన వివరించారు. కాగా బల్క్‌ డ్రగ్స్‌తో పాటు ఫార్మా సేవల కంపెనీలకూ హైదరాబాద్‌ కేంద్రంగా ఎదుగుతోందని ఈ సమావేశంలో పాల్గొన్న సప్తగిర్‌ గ్రూప్‌ ఎండీ శిల్పా రెడ్డి తెలిపారు. మరోవైపు ఫార్మా సేవల కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్‌ బాబు.. ఫార్మా కంపెనీల ప్రతినిధులకు హామీనిచ్చారు.

Updated Date - Jun 22 , 2024 | 04:09 AM

Advertising
Advertising