సీసీఎల్ ప్రొడక్ట్స్ ఆదాయం రూ.409 కోట్లు
ABN, Publish Date - May 12 , 2024 | 02:55 AM
సీసీఎల్ ప్రొడక్ట్స్.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి గాను స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన రూ.409.10 కోట్ల ఆదాయంపై రూ.20.07 కోట్ల నికర లాభాన్ని...
హైదరాబాద్: సీసీఎల్ ప్రొడక్ట్స్.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి గాను స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన రూ.409.10 కోట్ల ఆదాయంపై రూ.20.07 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.332.41 కోట్లుగా ఉండగా లాభం రూ.50.30 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో మొత్తం వ్యయాలు గణనీయంగా పెరగటంతో లాభం తగ్గింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను మొ త్తం ఆదాయం రూ.1,396.71 కోట్ల నుంచి రూ.1,461.76 కోట్లకు పెరిగినా లాభం మాత్రం రూ.175.36 కోట్ల నుంచి రూ.95.30 కోట్లకు తగ్గింది.
కాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.2 తుది డివిడెండ్‌ను బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. గతంలో ప్రకటించిన రూ.2.50 మధ్యంతర డివిడెండ్‌ను కలుపుకుంటే మొత్తం ఆర్థిక సంవత్సరానికి రూ.4.50 డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించినట్టయింది.
Updated Date - May 12 , 2024 | 02:55 AM